Gandeevadhari Arjuna Trailer : చివరగా 'ఎఫ్ 3' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మెగాప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం వరసగా సినిమాలను లైనప్‌లో పెడుతున్నారు. అలా ఇప్పటికే స్టైలిష్ అండ్ యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాండీవధారి అర్జున' అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేశారు. ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది.(varun tej gandeevadhari arjuna release date) విడుదల తేదీ దగ్గర పడటం వల్ల తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. "డిసెంబర్ 2020లో దేవుడు మీద మనిషి గెలిచాడట. జస్ట్ పాతికవేల సంవత్సరాలలో మనిషి చేసిన వస్తువులు దేవుడు చేసిన వాటిని మించేసాయంట. ఎలాగో తెలుసా..?" అంటూ నాజర్ సంభాషణలతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం.. యాక్షన్, ఛేజింగ్,ఎమోషన్స్, సస్పెన్స్‌తో ఆకట్టుకుంది.
దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ భారీ సమస్యను పరిష్కరించేందుకు సెక్యూరిటీ ఏజెంట్ అర్జున్‌గా వరుణ్ తేజ్ యాక్షన్ ఎంతో ఇంటెన్సివ్‌గా ఉంది. ' క్లైంట్ అయినా సరే తప్పు చేస్తే చంపేస్తా..' 'ప్రపంచానికి నిజం తెలియాలి?' అంటూ వరుణ్ డైలాగ్స్ చెప్పడం వంటి బాగున్నాయి. ఆయన స్టెలిష్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ప్రచార చిత్రం మధ్యలో మెడికల్ మాఫీయా, భారీ యుద్ధ పరికరాలు, తీవ్రవాదం వంటివి కూడా కాస్త చూపించారు. ఈ క్రమంలోనే 12 వేల మంది చనిపోయారంటూ అంటూ సంభాషణ రావడం ఆ తర్వాత దేశ రక్షణ కోసం వరుణ్ పోరాడటం వంటివి ఇంట్రెస్టింగ్గా సాగాయి. ఇంతకీ దేశానికి వచ్చిన ఆ పెద్ద సమస్య ఏంటి? అర్జున్ దాన్ని పరిష్కరించేందుకు ఎలాంటి ఆపరేషన్ చేపట్టాడు? దేశాన్ని ఎలా కాపాడాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేమిటి? వంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Praveen Sattaru Varun Tej Movie : ఇక ఈ ప్రచార చిత్రాన్ని దర్శకుడు ప్రవీణ సత్తార్ అద్భుతంగా కట్ చేశారు. హాలీవుడ్ స్టైల్లో ప్రతీ సన్నివేశంలో తన మార్క్ టేకింగ్‌ను బాగా చూపించారు. చివరిగా 'భూమికి పట్టిన అతి పెద్ద క్యాన్సర్ మనిషేనేమో' అంటూ నాజర్ సంభాషణతో ప్రచార చిత్రాన్ని మూగించారు. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ సినిమాలో సాక్షివైద్య కథానాయికగా కనిపించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">