ప్రముఖ నటుడు ప్రభాస్ దసరా సందర్భంగా దిల్లీలోని ప్రఖ్యాత రామ్‌లీలా మైదానంలో రావణ దహనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా రానున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, 15 దేశాలకు చెందిన రాయబారులు కూడా హాజరవుతారు. ఈ మేరకు లవ్ కుష్ రామ్‌లీలా కమిటీ ప్రెసిడెంట్ వివరాలు వెల్లడించారు. అయితే ఆదివారం టీజర్ కార్యక్రమం ముంగించుకుని దిల్లీ చేరుకున్నారు ప్రభాస్. అయితే దసరా సందర్భంగా బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లేదా హోం మంత్రి అమిత్ షాను కలుస్తారని సమాచారం. అనంతరం సాయంత్రం రామ్‌లీల రావణ దహన కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రభాస్‌ను చూసేందుకు భారీగా జనం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటి వరకు ఐదు లక్షలకు పైగా పాసులను ప్రజలకు పంపిణీ చేశారు. అదనంగా మరో రెండు లక్షల పాస్‌లు ముద్రిస్తున్నారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా ఇంత పెద్ద ఎత్తున నవరాత్రి ఉత్సవాలు జరగలేదు. దీంతో ఈసారి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది. అయితే గత 4 రోజులుగా రోజుకు 50 వేల మంది దాకా వస్తున్నారని లవ్కుష్ రామ్‌లీలా కమిటీ అధ్యక్షుడు తెలిపారు.
ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారీ ఏర్పాట్లు చేశారు. వీఐపీలు కూడా వస్తుండటం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వేదిక వద్ద 125 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. అనుక్షణం పర్యవేక్షించనున్నారు. 800 మందికి పైగా వలంటీర్లను బందోబస్తులో నియమించారు. 120 మంది బ్లాక్ కమాండో సెక్యూరిటీ గార్డులను కూడా నియమించారు. లీలా ప్రదర్శన సమయంలో దిల్లీ పోలీస్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అదనపు బలగాలు వేదిక వద్ద ఉంటారు. ఈసారి రావణ, కుంభకర్ణ, మేఘనాదుల దిష్టిబొమ్మలు 9 ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కోబొమ్మ ఎత్తు 100 అడుగుల ఉండేలా తీర్చిదిద్దారు.
ఇవీ చదవండి: 'ఈ ఏడాది బ్రహ్మాస్త్ర సినిమానే 'నెంబర్ 1'.. పార్ట్2 విడుదల అప్పుడే'
పంత్‌కు ఊర్వశి 'స్పెషల్' బర్త్‌డే విషెస్.. రెడ్ హాట్ లుక్‌లో ఫ్లయింగ్ కిస్..