ETV Bharat / entertainment

వామ్మో.. ఇదెక్కడి కనెక్షన్​రా బాబోయ్​.. సలార్​ టీజర్ టైమ్​.. కేజీయఫ్ క్లైమాక్స్​ ఎండ్​ సీన్​! - కేజీయఫ్ క్లైమాక్స్​ ఎండ్​ సీన్​ టైమ్​

Salaar Teaser : అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రభాస్ 'సలార్​' టీజర్ రిలీజ్​కు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. అయితే

Prabhas Salaar teaser Time announced
వామ్మో.. ఇదెక్కడి కనెక్షన్​రా బాబోయ్​.. సలార్​ టీజర్ టైమ్​.. కేజీయఫ్ క్లైమాక్స్​ ఎండ్​ సీన్​
author img

By

Published : Jul 4, 2023, 9:40 AM IST

Salaar Teaser : 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురైంది'.. అంటూ ప్రభాస్​ అభిమానులు పాడుకోవాల్సిన సమయం దగ్గరపడింది. జున్ 6న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో.. రీసెంట్​గా 'ఆదిపురుష్'​ రిజల్ట్​తో డీలా పడిన ప్రభాస్ అభిమానులకు 'సలార్' టీజర్ అప్డేట్​ రూపంలో మరో ఆశ చిగురించింది. 'కేజీయఫ్​' సిరీస్​తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇక విషయానికొస్తే.. ఇప్పుడందరి మదిలో టీజర్​ను అంత పొద్దున్నే 5:12 గంటలకు ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అని తెగ మాట్లాడుకుంటున్నారు. ఏమైనా సెంటిమెంటా? లేదా ఇంకేమైనా ఉందా? అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఓ కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.

అదేంటంటే.. ఇప్పటికే 'సలార్​'-'కేజీయఫ్'​కు లింక్ ఉందని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీజర్ టైమ్.. 'కేజీయఫ్ 2'లో రాఖీ భాయ్​ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో ఉన్న గడియారంలో ఉన్న సమయం ఒకట్టే. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి ఇప్పుడు తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. దీంతో ఈ సినిమాపై అంచనాలో ఊహించలేని స్థాయికి వెళ్లిపోయాయి. ప్రస్తుతం సోషల్​మీడియాలో ఎక్కడ చూసినా ఇవే పోస్టర్లు తెగ సందడి చేస్తున్నాయి. నిజానికి రాఖీ భాయ్​ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో మూడు నాలుగు గడియారాలు ఉన్నాయి. ఒక్కో గడియారంలో ఒక్కో సమయం ఉంది. అందులో ఒకటి 5:12.

నెటిజన్ల రియాక్షన్​ .. కొంతమందైతే ఈ పోస్టర్లు చూసి 'చంపేస్తే చంపేయండి.. లేదంటే.. ఈ హైప్​తోనే పోయేలా ఉన్నాం.. ఈ రెండు సినిమాలకు కనెక్షన్స్ ఉందా లేదా.. చెప్పండి' అంటూ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరికొంతమది ఇది ప్రశాంత్ నీల్ యూనివర్స్​ అని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వార్త నిజమైతే మాత్రం బాక్సాఫీస్ బద్దలవ్వడం పక్కా అనే చెప్పాలి.

Prabhas Salaar teaser Time announced
వామ్మో.. ఇదెక్కడి కనెక్షన్​రా బాబోయ్​..

Salaar movie Cast : ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్​గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ ప్రతినాయకులుగా కనిపించనున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్​పై యాక్షన్ ఎంటర్​టైనర్​గా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్​లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రతీ అభిమానిని, ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.