ETV Bharat / entertainment

బాహుబలితో కృతి న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​.. నిజమా? అయితే ఎక్కడ! - ప్రభాస్​ కృతి న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్

డార్లింగ్​ ప్రభాస్​తో కృతి సనన్​ ప్రేమాయణం సాగుతుందనే రూమర్ల విషయం తెలిసిందే. తాజాగా సినీ క్రిటిక్​ ఉమైర్​ సంధూ వీరిద్దరికి సంబంధించి ఓ ఆసక్తికరమైన ట్వీట్​ చేశారు. ఈ పోస్ట్​పై ప్రభాస్​ ఫ్యాన్స్​ కొందరు ఉమైర్​ను మెచ్చుకుంటుండగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది.

Prabhas Kriti New Year Celebrations
Prabhas Kriti Sanon
author img

By

Published : Dec 27, 2022, 7:13 PM IST

తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు దోచిన భామ కృతి సనన్. కళ్లతోనే మాయ చేసే ఈ ముద్దుగుమ్మ తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​తో ప్రేమలో పడినట్లు కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. ఆదిపురుష్ సినిమా షూటింగ్ సమయంలో ఈ జంట దగ్గరైందని, పెళ్లి కూడా చేసుకుంటారని సోషల్​మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు కానీ కృతి మాత్రం అప్పుడప్పుడు ప్రభాస్​పై మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్​ చేస్తోంది. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే..

Prabhas Kriti Sanon New Year Celebrations
ప్రభాస్​ కృతి సనన్

న్యూఇయర్​కి కేవలం నాలుగు రోజులే సమయం ఉన్నందున సెలబ్రిటీలంతా గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్​, నటి కృతి సనన్​ కూడా కలిసి సీక్రెట్​గా ఓ స్పెషల్​ ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరు కలిసి మాల్దీవులకు వెళ్లి సెలబ్రేట్​ చేసుకోనున్నారట. ఈ విషయాన్ని ప్రముఖ మూవీ క్రిటిక్​ ఉమైర్​ సంధూ కూడా ట్వీట్టర్​లో పోస్ట్ చేశాడు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ ప్రస్తుతం ఈ ట్వీట్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ప్రభాస్​ ఫ్యాన్స్​ స్పందిస్తున్నారు. గతంలో కృతి వదిన అంటూ ట్వీట్లు పెట్టి, సంబరాలు చేసుకున్న వారు ఈసారి మాత్రం చాలా ఘాటుగా స్పందిస్తున్నారు. ఉమైర్ సంధూకు స్ట్రాంగ్ వార్నింగ్​లు కూడా ఇస్తున్నారు. నీకు ఇంక పనేమీ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరైతే వెళ్లి రెండు పాలప్యాకెట్లు వేసిరా అంటూ ఎద్దేవా చేస్తుండగా.. కొందరు మాత్రం ఇలాంటి వార్తలతో అయినా ఎంటర్​టైన్​​ చేస్తున్నావ్ అంటూ థ్యాంక్స్ చెబుతున్నారు.

ఇక డార్లింగ్ సినిమాల విషయానికి వస్తే ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కె సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. మారుతీతో కలిసి రాజా డీలక్స్ సినిమా కూడా షూట్ స్టార్ట్ అయినట్లు ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా సుకుమార్- ప్రభాస్ 2024లో పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు ప్రచారం సాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.