తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే ఏ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన 'ఈశ్వర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగి దేశవ్యాప్తంగా ఎనలేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన ఎలా హీరోగా మారారో తెలుసా? తెరపై తనని తాను చూసుకోవాలని ప్రభాస్‌కు ఎప్పుడు అనిపించిందో తెలుసా? ఆయన నటించిన మొదటి ముడు సినిమాలు యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నప్పుడు డార్లింగ్ ఎలా ఫీల్ అయ్యారో తెలుసా? ఆ సంగతులే ఈ కథనం..
ఆ సినిమా చూసి.. చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు ప్రభాస్. కానీ ఆయన అందం, ఎత్తు చూసి చాలామంది 'హీరో.. హీరో' అని పిలిచేవారట. అలా పిలిచినప్పుడైనా నటుడవ్వాలన్న ఆలోచన రాలేదు. సినిమా షూటింగ్‌లకు చూసేందుకు వెళ్లినప్పుడు..హీరో కావడం అంత సులువు కాదనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. వెంటనే హీరో అవ్వాలనే ఆలోచన విరమించుకున్నారు. షూటింగ్‌లో వందల మంది ముందు ఎలా నటిస్తారోనన్న భయం కూడా ఏర్పడింది. వాళ్ల పెద్దనాన్న స్ఫూర్తితోనే సినిమాలపై ఆసక్తి పుట్టింది. పెదనాన్న కృష్ణంరాజుకు ప్రభాస్ వీరాభిమాని. దర్శకుడు బాపుతో కృష్ణంరాజు చేసిన 'భక్తకన్నప్ప', 'మనవూరి పాండవులు' చూసి తను కూడా పెదనాన్నలా హీరోలా అవ్వాలని నిర్ణయించుకున్నారు. అలా సినిమాల్లోకి రావాలనే ఆలోచన పెదనాన్న సినిమాలు చూడటంతో మొదలైంది.
ఆ సమయంలో నిరాశకు గురై.. మొదటి సినిమా 'ఈశ్వర్'తోనే ప్రభాస్‌కు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. అరంగేట్ర చిత్రమైనా నటన, హావభావాలతో ఆకట్టుకున్నారనే ప్రశంసలు దక్కాయి. అయితే హిట్టు మాత్రం దక్కలేదు. ఆ తర్వాత చేసిన 'రాఘవేంద్ర' కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. మొదటి రెండు సినిమాలు పరాజయం కావడంతో మూడో సినిమాను జాగ్రత్తగా పట్టాలెక్కించారు. మంచి ఫీల్‌గుడ్ ప్రేమకథ 'వర్షం'తో ప్రేక్షకులను పలకరించారు. మొదటి రోజు సినిమా జస్ట్ ఓకే అనే కామెంట్ వినిపించింది. దీంతో ఇది కూడా ఫ్లాపేనా అని నిరుత్సాహానికి గురయ్యారు. క్రమంగా 'వర్షం' కలెక్షన్లు పుంజుకున్నాయి. కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వరుసకట్టారు. విడుదలైన పదిరోజులకు సూపర్‌హిట్ టాక్ వినపడటంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రభాస్. వర్షంతో బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కాగా, ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సహా దర్శకుడు మారుతీతో ఓ సినిమా చేస్తున్నారు. నేడు డార్లింగ్ పుట్టనరోజు సందర్భంగా ఈ చిత్ర అప్డేట్స్ రానున్నాయి.
ఇదీ చూడండి: ఆ ఒక్క సినిమాకు 5 లక్షల మంది నిర్మాతలా?