ETV Bharat / entertainment

ఓవర్సీస్ కలెక్షన్స్​లో 'బ్రో' జోరు..తెలుగు రాష్ట్రాల్లోనూ అదే హవా..

Bro Movie Openings : పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లీడ్​ రోల్స్​లో వచ్చిన 'బ్రో' మూవీకి సర్వత్ర పాజిటివ్ రెస్పాన్స్​ వస్తోంది. ఇప్పటికే ప్రీమియర్​ షోస్​ చూసిన ఫ్యాన్స్ నెట్టింట తమ అభిప్రాయలతో సినిమా గురించి చెప్పేస్తుండగా.. అటు ఇండియాలోనూ ఇటు ఓవర్సీస్​లోనూ 'బ్రో' ఓపెనింగ్స్​ మంచి జోరులో ఉందట. ఆ వివరాలు మీ కోసం..

pawan kalyan bro movie overseas and india openings record
bro movie overseas and india openings
author img

By

Published : Jul 28, 2023, 7:56 AM IST

Updated : Jul 28, 2023, 8:54 AM IST

Bro Overseas Market : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లీడ్​ రోల్స్​లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'బ్రో'. కోలీవుడ్​లో విడుదలై మంచి టాక్ అందుకున్న వినోదయ సీతమ్​ అనే సినిమా రీమేక్​గా రూపొందిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు సముద్రఖని తెరకెక్కించారు. మామా అల్లుళ్ల కాంబినేషన్​లో వస్తున్న ఈ సినిమా గురించి అటు మెగ ఫ్యాన్స్​తో పాటు ఇటు మూవీ లవర్స్​ తెగ ఎదురు చూశారు. దీంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా శుక్రవారం అటు ఇండియాతో పాటు ఇటు ఓవర్సీస్​ థియేటర్లలో సందడి చేస్తోంది.

ఇక ఓవర్సీస్​లో ఈ సినిమాకు భారీగా వసూళ్లు నమోదయ్యాయని టాక్​ నడుస్తోంది. పవన్ కల్యాణ్​కు ఇండియాలోనే కాదు ఓవర్సీస్​ మార్కెట్​లోనూ మంచి పేరు ఉంది. అక్కడ కూడా పవన్​కు విపరీతమైన ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. ఈ క్రమంలోనే 'బ్రో' సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ సేల్స్ కూడా ఓ రేంజ్​లో జరిగాయని టాక్​. అయితే తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం 4.30 గంటల వరకు ఓవర్సీస్ వసూళ్ల వివరాలను చూస్తే...

నార్త్ అమెరికాలో సుమారు 243 లొకేషన్లలో 'బ్రో' సినిమా రిలీజవ్వగా.. దాదాపు 523,169 డాలర్లు వసూలు అయ్యాయని తెలిసింది. యూఎస్​లో 482,463 డాలర్లు కలెక్ట్ అయ్యాయట. ఇక కెనడాలో 40,706 డాలర్లు వసూలు అయ్యాయని అక్కడి ట్రేడ్​ వర్గాల అంచనా.

Bro Movie Openings : మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్​ మూవీకి ఏ మాత్రం జోరు తగ్గలేదు. ఇప్పటికే ప్రీమియర్ షోలతో సందడి చేస్తున్న ఈ సినిమా పాజిటివ్​ టాక్​ అందుకుని బాక్సాఫీస్​ వద్ద దూసుకెళ్తోంది. అయితే 'బ్రో' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయని టాక్​. ముఖ్యంగా ఆంధ్ర-తెలంగాణలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రీమియర్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్​లో ఊహించని రేంజ్​లో కనిపిస్తున్నాయి. హైదరాబాద్​లో దాదాపు 700 షోస్​కి 600 షోల బుక్కింగ్స్​ నిండిపోయాయని సమాచారం. ఇక విశాఖలో 290కి ఏకంగా 278 షోస్​ నిండిపోవడం విశేషం.

ఇక విజయవాడ 230/230, కాకినాడ 76/80, గుంటూరు 120/135, తిరుపతి 48/53, రాజమండ్రి 52/52, నెల్లూరు 60/62 షోస్​ ఫిల్ అయ్యాయని టాక్​. అయితే ఇతర పెద్ద నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్​లో బుక్కింగ్స్​ కాస్త తక్కువ అయినట్లు అనిపిస్తోందట. ఏదేమైనా ఈ లెక్కన చూస్తే ఓపెనింగ్స్ వసూళ్లు రికార్డులు అదిరిపోయేలా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు జోస్యం పలుకుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Jul 28, 2023, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.