ETV Bharat / entertainment

సల్మాన్ ఖాన్​ డ్యాన్స్​పై ట్రోల్స్​.. ఫుల్​గా నవ్వుకున్నా: పూజా హెగ్డే - నైయో లగ్డా డ్యాన్స్​పై పూజా హెగ్డే రియాక్షన్​

బాలీవుడ్‌ భాయ్​ సల్మాన్‌ఖాన్‌ డ్యాన్స్​పై ఫుల్​గా ట్రోల్స్​ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై హీరోయిన్ పూజా హెగ్డే స్పందించింది. ఏం చెప్పిందంటే..

Pooja hegdey
సల్మాన్ ఖాన్​ డ్యాన్స్​పై ట్రోల్స్​.. ఫుల్​గా నవ్వుకున్నా: పూజా హెగ్డే
author img

By

Published : Apr 19, 2023, 9:38 PM IST

Updated : Apr 19, 2023, 10:19 PM IST

బాలీవుడ్‌ భాయ్​ సల్మాన్‌ఖాన్‌ నటించిన కొత్త చిత్రం 'కిసీ కా బాయ్‌ కిసీ కీ జాన్‌'. పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. 'వీరమ్‌', 'కాటమరాయుడు' చిత్రాలకు రీమేక్‌గా ఇది తెరకెక్కిందని సమాచారం. మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. దీంతో మూవీటీమ్​ ప్రమోషన్స్‌లో ఫుల్​ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే హీరోయిన్​ పూజాహెగ్డే కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఒకే రోజు పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఇందులో భాగంగా.. ఆమె సల్మాన్‌ డ్యాన్స్‌పై వచ్చిన ట్రోల్స్​, మీమ్స్‌పై స్పందించింది.

"మా సినిమా నుంచి 'నైయో లగ్డా' పాట కొద్ది రోజుల క్రితం విడుదలైంది. అయితే దీనిపై కొంతమంది మీమ్స్‌ క్రియేట్‌ చేసి పోస్ట్ చేశారు. బాగా ట్రోల్స్​ కూడా చేశారు. వాటిని చూసి నేనైతో ఫుల్​గా నవ్వుకున్నాను. మనుషులు ఎంతో స్పీడ్‌గా అయిపోయారనిపించింది. సాంగ్​ రిలీజ్​ అయిన వెంటనే దానిపై మీమ్స్‌ క్రియేట్‌ చేసేస్తున్నారు" అని పూజా చెప్పింది.

సోషల్‌మీడియాలో వచ్చే ట్రోల్స్​పై మాట్లాడుతూ.. "నేను సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. సోషల్​మీడియాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా నాపై వచ్చే విమర్శలు, ట్రోల్స్‌, మీమ్స్​ కూడా చూస్తుంటాను. చదువుతుంటాను. అయితే నేను అన్ని విమర్శలను ఒకేలా చూడను. కొంతమంది కావాలనే నెగెటివ్‌గా కామెంట్స్‌ చేస్తూ ట్రోల్స్​ చేస్తుంటారు. వాటిని నేను అస్సలు పట్టించుకోను. నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను. వాటిని పరిగణలోకి తీసుకుంటాను. నేను అందర్నీ సంతోష పెట్టలేను కదా. నాలాగా నేను ఉంటూ ముందుకు సాగుతుంటాను" అని పూజా చెప్పింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో సూపర్​స్టార్​ మహేశ్‌బాబుతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడింది. SSMB 28లో మహేశ్‌ బాబును కొత్తగా చూసేందుకు రెడీగా ఉండమని చెప్పింది.

కాగా, సల్మాన్‌ - పూజాహెగ్డేలపై చిత్రీకరించిన ఈ నైయో లగ్డా పాటను ప్రేమికుల దినోత్సవం రోజున లిలీజ్​ చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్​లో 150 మిలియన్లకు పైగా వ్యూస్​ను దక్కించుకుంది. అయితే, ఈ సాంగ్​ రిలీజ్ అయినప్పుడు.. సల్మాన్‌ డ్యాన్స్‌పై ఎన్నో మీమ్స్‌, ట్రోల్స్​ వచ్చాయి. కొరియోగ్రఫీ కామెడీగా ఉందని తెగ ట్రోల్​ చేశారు.

ఇక సల్మాన్ ఈ చిత్రంతో పాటు 'టైగర్​ 3' చిత్రంలోనూ నటిస్తున్నారు. కత్రినా కైఫ్‌ హీరోయిన్​గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'టైగర్‌ జిందా హై'కు సీక్వెల్‌ ఇది. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ఇది రిలీజ్ కానుంది.

ఇదీ చూడండి: ఆ ఒక్కటి.. తారలకు తీసుకొస్తుందిగా మరింత అందం!

Last Updated : Apr 19, 2023, 10:19 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.