ETV Bharat / entertainment

త్రిషకు ఆ బడా దర్శకుడు వార్నింగ్​.. ఎందుకంటే? - పొన్నియన్ సెల్వన్​ త్రిష

తనకు ఓ దర్శకుడు వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు హీరోయిన్ త్రిష. ఎందుకలా ఆయన వార్నింగ్​ ఇచ్చారో కూడా వివరించారు. ఇంతకీ ఆయన ఎవరంటే..

trisha
త్రిష
author img

By

Published : Sep 28, 2022, 5:47 PM IST

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్​ చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'. ఈ సినిమాలో త్రిష కుందవై అనే యువరాణి పాత్రలో, ఐశ్వర్య రాయ్‌ నందిని పాత్రలో నటించారు. తాజాగా పొన్నియిన్‌ సెట్లో జరిగిన సరదా సన్నివేశాన్ని త్రిష ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడు మణిరత్నం తనకు ఇచ్చిన స్వీట్‌ వార్నింగ్ గురించి చెప్పారు. ఐశ్వర్యతో త్రిష సెల్ఫీ తీసుకుంటుంటే 'మీరిద్దరూ అలా ఉండద్దు, ఐశ్వర్యతో అలా మాట్లాడకు' అని చెప్పారట. ''నేను, ఐశ్వర్య మంచి స్నేహితులం. సెట్‌లో ఎప్పుడూ కబుర్లు చెప్పుకుంటూ సందడిగా ఉండేవాళ్లం. ఒకరోజు షూటింగ్‌లో చాలా ముఖ్యమైన సన్నివేశం జరుగుతోంది. మణిరత్నం మా ముందు నుంచి వెళ్తు... మీరిద్దరూ ఇంత స్నేహంగా ఉండద్దు. ఐశ్వర్యతో మాట్లాడకు. ఎందుకంటే ఇప్పుడు సీన్‌లో మీరిద్దరూ ఒకరినొకరు ద్వేషించుకోవాలి'' అని స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారని నవ్వూతూ చెప్పింది త్రిష.

ఇక తాజాగా వైరల్‌ అయిన తన ఫొటో గురించి మాట్లాడుతూ..'' ఈ రోజుల్లో ఏది వైరల్‌ అవుతుందో ఊహించ లేకపోతున్నాం. నేను షేర్‌ చేసిన ఫొటోని 6 లక్షల మంది లైక్‌ చేశారు. నిజం చెప్పాలంటే ఆ ఫొటో వైరల్‌ అయినందుకు ఆనందిస్తున్నా. ఎందుకంటే అలా సినిమాలో ఫొటోలు వైరల్‌ అయితే సినిమాపై అంచనాలు పెరుగుతాయి.'' అన్నారు. భారీ తారాగణంతో తెరకెక్కనున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: Ponniyan selvan: ఈ స్టార్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.