Bro movie first day collection : మెగా హీరోలు పవన్ కళ్యాణ్-సాయిధరమ్‌తేజ్ కలిసి హీరోలుగా నటించిన 'బ్రో' సినిమా ఈ శుక్రవారం(జులై 29) ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో ఈ వీకెండ్ అంతా థియేటర్లన్నీ అభిమానుల సందడితో కళకళలాడుతోంది. ఫ్యాన్స్ ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి.
ఫస్ట్ డే ఎంత వచ్చాయంటే.. మొదటి రోజు ఈ చిత్రానికి డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. రూ.30 కోట్ల వరకు వసూళ్లను అందుకన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి వర్షాల కారణంగా మొదటి రోజు ఈ చిత్రం రూ.20 నుంచి రూ.22 కోట్ల మధ్య వసూళ్లను అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ వారి అంచనాల్ని అధిగమిస్తూ రూ.30 కోట్ల వరకు కలెక్షన్స్‌ను ఈ చిత్రం దక్కించుకున్నట్లు తెలిసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 23.61 కోట్లు షేర్, రూ. 35.50 కోట్లు గ్రాస్ వచ్చిందట.నైజాంలో రూ. 8.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.45 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.98 కోట్లు, గుంటూరులో రూ. 2.51 కోట్లు, కృష్ణాలో రూ. 1.21 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలు వచ్చాయట.
వరల్డ్ వైడ్‌గా.. ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 23.61 కోట్లు అందుకున్న ఈ బ్రో చిత్రం వరల్డ్ వైడ్‌గానూ పర్వాలేదనిపించింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు కలెక్ట్ చేసిందట. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.01 కోట్లు షేర్, రూ. 48.50 కోట్లు గ్రాస్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
Bro movie review : ఇకపోతే 'బ్రో' సినిమా విషయానికి వస్తే... మామాఅల్లుళ్లు పవన్ సాయితేజ్‌తో పాటు హీరోయిన్లుగా కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. బ్రహ్మానందం సహా పలువురు నటులు కూడా ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. సినిమాకు పవన్‌కల్యాణ్.. తేజ్ మధ్య సన్నివేశాలు, ఫస్టాఫ్‌లో ఎంటర్టైన్మెంట్, వినోదం, ఫ్యాన్స్‌ను మెప్పించే అంశాలుడటం బలం. అయితే కథలో సంఘర్షణ కొరవడింది. అదే బలహీనత. మొత్తంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే పవన్ 'బ్రో' తన ఎనర్జీతో మెప్పిస్తాడు!
ఇదీ చూడండి :
Bro Movie Review : 'బ్రో'.. మామా అల్లుళ్లు ఆడియెన్స్‌ను మెప్పించారా?
ఫ్యాన్స్‌కు తేజూ రిక్వెస్ట్.. ట్విట్టర్ వేదికగా ఎమోషనల్..