హీరోలు.. సింగర్స్‌గా మారి పాటలు పాడే ట్రెండ్ పాతదే. ఇప్పటికే పలువురు కథానాయకులు.. తమ సినిమాల్లోని పాటలకు గాత్రం అందించారు. మరికొందరు వేరే హీరోల చిత్రాలకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు. అయితే ఈ మధ్యకాలంలో బిజీ షెడ్యూల్స్, ఇతర కారణాల వల్ల హీరోలు.. పాటలు పాడే ట్రెండ్‌కు కాస్త దూరంగా ఉంటున్నారు. పాటలు పాడటానికి అంతగా ఆసక్తి చూపడం లేదు!
అయితే ఈ ట్రెండ్‌ను హరిహర వీరమల్లు సినిమాతో మళ్లీ సెట్ చేసేందుకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం సింగర్‌గా ఆయన అవతారమెత్తబోతున్నట్లు సమాచారం. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్‌ను పవన్ పాడబోతున్నట్లు తెలిసింది. నిజానికి హరిహర వీరమల్లు సినిమాకు ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రత్యేక సందర్భంలో వచ్చే ఓ పాటకు పవన్ గళం అయితేనే బాగుంటుందని భావించిన కీరవాణి...ఈ సాంగ్ పాడమని పవర్‌స్టార్‌ను రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం.
కీరవాణి కోరిక మేరకు ఈ పాట పాడటానికి పవన్ అంగీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నారు. త్వరలోనే ఈ సాంగ్‌ను రికార్డ్ చేయబోతున్నట్లు తెలిసింది. గతంలో జానీ, అత్తారింటికి దారేది సినిమాల్లో చిన్న బిట్ సాంగ్స్ మాత్రమే పవన్ కల్యాణ్ పాడారు. పూర్తి స్థాయి సాంగ్ పాడటం ఇదే మొదటిసారి!
ఇక సినిమా విషయానికొస్తే.. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు క్రిష్ హరిహరవీరమల్లు సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో మొఘలుల కాలం నాటి బందిపోటు దొంగగా పవన్ కనిపించబోతున్నారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా కనిపించబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రను పోషిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మే నెలలో హరిహరవీరమల్లు కొత్త షెడ్యూల్ ప్రారంభంకాబోతున్నట్లు సమాచారం. . జూలైలోగా షూటింగ్ పూర్తిచేసి దసరాకు సినిమాను రిలీజ్ చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉందట.
మరోవైపు, పవన్ కూడా అటు రాజకీయాల్లో.. ఇటు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలు పట్టాలెక్కిస్తూ బిజీగా గడపుతున్నారు. ఇటీవలే తన మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ సీతం రీమేక్‌కు తన పార్ట్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సముద్ర ఖని ఇటీవలే తెలిపారు. అది కూడా తన ఫ్యాన్ కమ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కూడా ఓకే చేశారు. అందుకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.