ETV Bharat / entertainment

రామోజీ ఫిల్మ్​సిటీలో పవన్​ 'వీరమల్లు' షూటింగ్​.. 'కాంతార' బ్యూటీ కొత్త మూవీ! - పవన్​కల్యాణ్ న్యూస్

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'హరి హర వీర మల్లు' సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్​సిటీలో శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాను వేసవికి విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు, 'కాంతార' భామ సప్తమి గౌడకు సినిమాలు వరుస క్యూ కడుతున్నాయి. ఆమె.. ప్రముఖ నటుడు అంబరీష్‌ తనయుడు అభిషేక్‌ అంబరీష్‌తో జట్టుకట్టనున్నాట.

pawan kalyan
పవన్ కల్యాణ్
author img

By

Published : Nov 19, 2022, 8:30 AM IST

Hari Hara Veera Mallu Shooting: కీలకమైన సన్నివేశాల చిత్రీకరణతో శరవేగంగా సాగుతోంది 'హరి హర వీర మల్లు'. ఒక పక్క రాజకీయ పర్యటనల్ని కొనసాగిస్తూనే, మరోపక్క ఈ సినిమాని పూర్తి చేయడంపై దృష్టిపెట్టారు పవన్‌కల్యాణ్‌. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. శుక్రవారం పవన్‌కల్యాణ్‌, ఇతర తారాగణంపై ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ నేతృత్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌కి ముందు ప్రత్యేకంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో కూడా పాల్గొన్నారు పవన్‌కల్యాణ్‌. వేసవికి విడుదల చేయడమే లక్ష్యంగా చిత్రీకరణ కొనసాగుతోంది.

క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు బాబీ డియోల్‌ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఆయన ఔరంగజేబు పాత్రలో నటిస్తారని, వచ్చే నెలలో చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎ.దయాకర్‌రావు నిర్మిస్తుండగా, ఎ.ఎం.రత్నం సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

Kantara Sapthami Gowda: 'కాంతార'.. దేశం మొత్తాన్ని ఊపేసిన కన్నడ చిత్రం. కన్నడలో భారీ విజయం సాధించడమే కాదు ఇతర భాషల్లోకి అనువాదమై అక్కడా వసూళ్ల వర్షం కురిపించిందీ చిత్రం. ఈ చిత్రంలో నటించిన రిషబ్‌శెట్టితో పాటు నాయిక సప్తమి గౌడకు కూడా మంచి పేరొచ్చింది. అంతకుముందు ఆమె పలు చిత్రాల్లో నటించినా కూడా 'కాంతార' విజయం తో ఆమెకు అవకాశాలు వరసకడుతున్నాయి.

ఇప్పుడామె 90ల నాటి నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథలో నటించనున్నట్లు సమాచారం. ప్రముఖ నటుడు అంబరీష్‌ తనయుడు అభిషేక్‌ అంబరీష్‌ కథానాయకుడిగా ఎస్‌ కృష్ణ 'కాళి' అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాయికగా సప్తమిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.