PavanKalyan As Producer: తమిళ చిత్రసీమలో పలు విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రవి.కె.చంద్రన్... మహేశ్‌బాబు 'భరత్ అనే నేను' సినిమాతో కెమెరామెన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సక్సెస్ తర్వాత పవన్ కల్యాణ్ 'భీమ్లానాయక్' సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. రవి.కె.చంద్రన్ విజువల్ స్టోరీ టెల్లింగ్ అద్భుతమంటూ సినిమా ప్రమోషన్స్‌లో ఆయనపై పవన్ ప్రశంసలు కూడా కురిపించారు.
-
Power Star @PawanKalyan to co-produce #Tamara movie under @PKCreativeWorks 🔥
— Bhuvan Raj (@bhuvanrajdvbr) May 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Directed by @dop007 👏🏻
Film will be totally shot in france & pondicherry (Chennai) pic.twitter.com/3TkhG3dOoG
">Power Star @PawanKalyan to co-produce #Tamara movie under @PKCreativeWorks 🔥
— Bhuvan Raj (@bhuvanrajdvbr) May 26, 2022
Directed by @dop007 👏🏻
Film will be totally shot in france & pondicherry (Chennai) pic.twitter.com/3TkhG3dOoGPower Star @PawanKalyan to co-produce #Tamara movie under @PKCreativeWorks 🔥
— Bhuvan Raj (@bhuvanrajdvbr) May 26, 2022
Directed by @dop007 👏🏻
Film will be totally shot in france & pondicherry (Chennai) pic.twitter.com/3TkhG3dOoG
తాజాగా రవి.కె.చంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ 'తమరా'కు పవన్‌కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. తొలుత ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ నిర్మాణంలో పవన్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ కూడా భాగమైనట్లు దర్శకుడు ప్రకటించారు. వసంత్ సెల్వన్ అనే రచయిత రాసిన 'దీపన్' అనే నాటకం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తన మూలాలను అన్వేషిస్తూ పుదుచ్చేరి వచ్చిన ఓ యువతికి ఎదురైన అనుభవాలతో ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా రూపొందిద్దుకుంటున్నట్లు సమాచారం.
Suriya 41 Movie Update: సూర్య కథానాయకుడిగా దర్శకుడు బాల ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. రెండు మూడు రోజులుగా సినీవర్గాల్లో ఈ సినిమాపై ఊహగానాలు వినిపిస్తున్నాయి. సినిమా ఆగిపోయిందని.. హీరో, దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయని గుసగుసలు వినిపించాయి. సినిమా పక్కన పెట్టేశారని అని కూడా కొందరు అన్నారు. వాటికి హీరో సూర్య ఫుల్ స్టాప్ పెట్టారు.
-
Waiting to be back on sets…!! #Suriya41 pic.twitter.com/enuJ5MNbZJ
— Suriya Sivakumar (@Suriya_offl) May 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Waiting to be back on sets…!! #Suriya41 pic.twitter.com/enuJ5MNbZJ
— Suriya Sivakumar (@Suriya_offl) May 26, 2022Waiting to be back on sets…!! #Suriya41 pic.twitter.com/enuJ5MNbZJ
— Suriya Sivakumar (@Suriya_offl) May 26, 2022
దర్శకుడు బాలాతో ఏదో డిస్కస్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోను సూర్య సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''మళ్లీ సెట్స్‌లోకి రావడానికి వెయిట్ చేస్తున్నాను. #Suriya41'' అని ఆ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దాంతో ఊహగానాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. ఇప్పటికే కన్యాకుమారిలో ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్‌ను పూర్తి చేశారు. త్వరలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాను సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.
ఇవీ చదవండి: NBK107: ఫ్యాన్స్‌కు పూనకాలే.. బాలయ్య కొత్త సినిమా టైటిల్ ఫిక్స్!
'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ వాయిదా.. 'పక్కా కమర్షియల్' అప్డేట్