ETV Bharat / entertainment

పాకిస్థాన్​లో అక్రమంగా పఠాన్​ స్క్రీనింగ్​.. రూ.700కోట్ల కలెక్షన్స్​! - పఠాన్​ మూవీ ఓవర్సీస్​ కలెక్షన్స్

బాలీవుడ్ బాద్​షాకు ఇండియాలోనే కాదు ఓవర్సీస్​లోనూ ఫ్యాన్​ ఫాలోయింగ్​ విపరీతంగా ఉంది. దీనికి నిదర్శనం పఠాన్​ మూవీ కలెక్షన్స్​. వరల్డ్​వైడ్​గా ఈ సినిమా బక్సాఫీస్​ను షేక్​ చేస్తోంది. ఈ సినిమా పాకిస్థాన్​లో అయితే అక్రమంగా స్క్రీనింగ్​ వేసి మరీ చూస్తున్నారట. బ్లాక్​లో టికెట్స్​ అమ్ముతున్నారని తెలిసిందే. అక్కడ కూడా మంచి వసూళ్లు వస్తున్నాయట.

pathaan
pathaan
author img

By

Published : Feb 4, 2023, 10:00 AM IST

Updated : Feb 4, 2023, 10:23 AM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ గత 30 ఏళ్లుగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో అలరిస్తున్నాడు. ఈయన సినిమాలకు భారత్​లోనే కాకుండా ఓవర్సీస్​లో ఫ్యాన్స్​ ఉన్నారు. షారుక్​ సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతుందో అని వేయి కళ్లతో చూసే అభిమానులు కూడా ఉన్నారు. తాజాగా రిలీజైన పఠాన్​ సినిమాతో మరింత ఫ్యాన్​ ఫాలోయింగ్​ పెంచుకున్నారు ఈ బాలీవుడ్​ స్టార్​. ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద హిట్​ అవ్వడమే కాకుండా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల మార్క్​ను టచ్ చేసి మరింత విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజ్​ చూసిన పాకిస్థాన్​ వాసులు ఆ సినిమాను అక్రమంగా చూస్తున్నారట. ఈ విషయం ఫేస్​బుక్​లో ఓ పోస్ట్​ ద్వారా వ్యాపించగా ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

ఆ పోస్ట్ ప్రకారం పఠాన్ స్క్రీనింగ్ పాకిస్థాన్​ రాజధాని కరాచీలో జరిగిందని.. సినిమా టిక్కెట్టు కూడా రూ.900కు అమ్ముడుపోతుందట. ఈ సినిమాను డిఫెన్స్ హౌసింగ్ అథారిటీలో మరో సారి స్క్రీనింగ్​ చేస్తున్నట్లు అంతే కాకుండా.. పఠాన్‌ను పాకిస్థాన్‌లో ప్రదర్శించే బాధ్యతను యూకేకు చెందిన ఫెయిర్‌వర్క్ ఈవెంట్స్ అనే సంస్థ తీసుకుందని తెలుస్తోంది. సామాజిక మాధ్యామల్లో ఈ వార్త హల్​ చల్​ అవుతుండటంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుల్వామా దాడి తర్వాత పాకిస్థాన్​లో ఇండియా సినిమాల స్క్రీనింగ్​ నిలిపేశారని అయినా వీళ్లు ఇలా అక్రమంగా ఎలా చూస్తారంటూ మండి పడుతున్నారు. అయితే ఈ వార్తలను పాకిస్థాన్ ఖండించింది. 'మా దేశంలో భారతీయ చిత్రాలను నిషేధించినప్పుడు, పఠాన్​ను మేమెందుకు ప్రదర్శిస్తాం" అని అంటోంది. ఇలా ఇరు దేశాల మధ్య ఈ విషయమై చర్చలు జరుగుతుండగా.. ఆ పోస్ట్​ను ఫేస్​బుక్​ నుంచి తొలగించారు.

700 కోట్ల మార్క్​ను దాటిన పఠాన్​..
జనవరి 25న రిలీజైన పఠాన్ సినిమా బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుక్​ నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలకు అనుగుణంగా సినిమా కూడా సూపర్​హిట్​గా నిలిచింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. తాజాగా రూ.700 కోట్ల మార్కును అందుకుని మరింత దూసుకెళ్తోంది.

Last Updated : Feb 4, 2023, 10:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.