ETV Bharat / entertainment

oscar awards 2023 : ఆస్కార్​కు వేళాయే.. 'నాటు నాటు'కు ఓటు దక్కేనా! - ఆస్కార్​ 2023 రేసులో లేడి గాగా

oscar awards 2023 : భారతీయ సినీ పరిశ్రమకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టడమే కాకుండా అంతర్జాతీయ గుర్తింపు పొందింది 'ఆర్​ఆర్​ఆర్​'​. ఆ సినిమాలోని 'నాటు నాటు.. ' పాటు ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్​ బరిలో నిలించింది. ఈ పాటతో పాటు రేసులో ఉన్న మిగతా పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి. లేడీ గాగా, రిహాన్నా లాంటి అంతర్జాతీయ గాయకులు పాడిన ఈ పాటలు.. నెట్టింట వైరలయ్యాయి. ఇంతకీ ఆ పాటలేంటో? వాటి వెనుకల ఉన్న కథేంటో? ఓ సారి చూసేద్దామా..

oscar naatu naatu
oscar naatu naatu
author img

By

Published : Mar 11, 2023, 11:39 AM IST

Updated : Mar 11, 2023, 12:00 PM IST

దగ్గజ దర్శకుడు తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్​' సినిమా ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకుంది. ఆ సినిమాలోని 'నాటు నాటు..' అంటూ సాగే పాట ఆస్కార్​ రేసులో నిలిచింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఈ పాట.. మొదటి సారి గోల్డెన్​ గ్లోబ్​ వేదికపై అవార్డు సొంతం చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ వైపు చూడటం మొదలెట్టారు. ఇక ఈ పాటకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. సంగీత ప్రియులు ఈ పాటను లూప్​లో పెట్టుకుని మరీ వింటున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే, ఈ పాట ఆస్కార్​కు నామినేట్​ అయి దేశానికే గర్వకారణంగా నిలించింది. ఎలాగైనా ఆస్కార్​ను భారత్​కు తీసుకుని రావాలని అటు 'ఆర్​ఆర్​ఆర్​' టీమ్​తో పాటు భారతీయులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే 'నాటు నాటు'తో పాటు ఆస్కార్​ రేసులో ఉన్న మిగతా పాటల కూడా గుర్తింపు పొందాయి. లేడీ గాగా, రిహాన్నా లాంటి ఇంటర్నేషనల్​ సింగర్స్​ పాడిన ఈ పాటలు నెట్టింట ఎంతో శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇక ఆ పాటల గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ కోసం..

  • దర్శక ధీరుడు జక్కన్న మాస్టర్​ పీస్​ 'ఆర్​ఆర్​ఆర్'​లోని 'నాటు నాటు..' సాంగ్​కు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. కీరవాణి బాణీలు కట్టిన ఈ పాటకు చంద్రబోస్​ సాహిత్యం ఊపిరి పోసింది. ఇక రాహుల్​ సిప్లిగంజ్​, కాలభైరవ గాత్రంతో అందరిని మైమరిపించగా.. ప్రేమ్​ రక్షిత్​ స్టెప్పులు పాటకే హైలైట్​గా నిలిచింది. ప్రతిష్టాత్మక గోల్డెన్‌గ్లోబ్‌తో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఈ పాటకు.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వేసిన స్టెప్పులు భాష, ప్రాంతాలకు అతీతంగా అందరిని ఉర్రూతలూగించాయి.
    naatu naatu song
    నాటు నాటు సాంగ్​
  • హాలీవుడ్​లోని 'టెల్‌ ఇట్‌ లైక్‌ ఏ ఉమెన్‌' సినిమాలోని 'అప్లాజ్‌' అనే పాట ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయ్యింది. ప్రముఖ అమెరికన్‌ రచయిత డయాన్‌ వారెన్‌ రాసిన ఈ పాటను సోఫియా కార్సన్‌ ఆలపించారు. అయితే 'అప్లాజ్‌' అనే ఈ పాట.. స్త్రీ సాధికారత గురించి, మనల్ని మనం గౌరవించుకోవాలనే విషయాలను తెలియజేసేలా చక్కగా రాశారు రచయిత.
  • ఇక ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్​ బరిలో నామినేషన్‌ దక్కించుకున్న మరో పాట 'బ్లాక్‌ పాంథర్‌ : వకాండా ఫరెవర్‌' చిత్రంలోని 'లిఫ్ట్‌ మీ అప్‌'. టేమ్స్‌, నైజీరియా గాయకుడు ర్యాన్‌ కూగ్లర్‌ రాసిన ఈ పాటకు. రిహాన్నా, టేమ్స్‌, ర్యాన్‌ కూగ్లర్‌, లుడ్విగ్‌ గోరావ్సన్‌ సంగీతం సమకూర్చారు. బార్బాడియన్‌ గాయని, నటి రిహాన్నా ఈ పాటను తనదైన శైలీలో ఆలపించారు సంగీత ప్రియులను అలరించారు. కాగా గత రెండేళ్లలో రిహాన్నా పాడిన పాటల్లో గొప్పదిగా నిలిచింది. ప్రముఖ అమెరికన్‌ నటుడు చాడ్విక్‌ బోస్‌మెన్‌కు నివాళిగా ఈ పాటను అంకితం చేసింది 'బ్లాక్​ పాంథర్'​ మూవీ టీమ్​.
    rihanna
    రిహాన్నా
  • 95వ ఆస్కార్​ అకాడమీ అవార్డ్స్‌లో 'ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌' చిత్రంలోని 'దిస్‌ ఇజ్‌ ఎ లైఫ్‌' కూడా ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయ్యింది. ర్యాన్‌ లాట్, డేవిడ్‌ బైర్న్‌ ఈ పాటను రాయడమే కాకుండా సంగీతాన్ని కూడా అందించారు. ప్రముఖ స్కాటిష్‌- అమెరికా గాయకుడు డేవిడ్‌ బైర్నే, మిట్స్కీలు ఈ పాటను పాడారు.
  • అమెరికన్​ సింగర్​ లేడి గాగా రాసిన 'హోల్డ్‌ మై హ్యాండ్‌' అనే పాట కూడా ఆస్కార్​ రేసులో నామినేట్ అయ్యింది. 'టాప్‌ గన్‌:మావెరిక్‌' సినిమాలోని ఈ పాట కోసం లేడి గాగాతో పాటు బ్లడ్‌ పాప్‌ గొంతు కలిపారు. ఈ పాటకుగాను ఆమెకు పలు చిత్రోత్సవాల్లో ప్రశంసలు దక్కాయి. అయితే ఈ విభాగంలో గాగాకు ఇది మూడో నామినేషన్‌ కాగా 2019లో పురస్కారం కూడా గెలుచుకుంది.
    lady gaga
    లేడి గాగా
  • ఇదీ చదవండి:
  • NTR 30లో జాన్వీ.. ప్రాజెక్ట్​-Kలో దీపిక.. టాలీవుడ్​ వైపు బీటౌన్​ బ్యూటీల అడుగులు!
  • ఆస్కార్​ వేడుకకు అంతా రెడీ.. స్ట్రీమింగ్​ ఎప్పుడు? ఎలా చూడొచ్చు?

Last Updated : Mar 11, 2023, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.