దాదాపు 2 నెలల తర్వాత టాలీవుడ్‌కు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఇటీవల విడుదలైన సీతారామం, బింబిసార ఇప్పటికే హిట్ టాక్‌తో దూసుకెళ్తుండగా.. తాజాగా విడుదలైన కార్తికేయ-2 కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, రష్మిక మంధాన ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సీతారామం సాలిడ్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 45 కోట్లకుపైగా గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా సీతారామం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ఈ రొమాంటిక్ పీరియాడికల్ డ్రామా మూవీ అమెరికాలో 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది. ఇంకా మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త సినిమాలు వస్తున్నా.. కలెక్షన్లు ఏ మాత్రం తగ్గట్లేదు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం బింబిసార బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. కేథరిన్, సంయుక్త మేనన్ కథానాయికలుగా నటించిన ఈ ఫాంటసీ డ్రామాకు నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహించాడు. కీరవాణి సంగీతం అందించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏలోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది.
శనివారం నాటికి ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల 5 లక్షల డాలర్ల మార్క్‌ను దాటింది. సినిమా ఇలాగే కొనసాగితే త్వరలో 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయం. మరోవైపు రెండో వారంలో స్క్రీన్స్ సంఖ్య పెరుగుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం కేవలం 3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ స్టేటస్ సాధించింది. లాంగ్ రన్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టే అవకాశముంది.
ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్ 'కార్తికేయ 2' కూడా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రానికి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్ వచ్చింది. రూ.5.05 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికాలోనూ సీతా రామం, బింబిసారతో పోటీపడుతోంది. ఇప్పటికే అమెరికాలో 1000కిపైగా షోలు అమ్ముడుపోయినట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు హిందీలోనూ తొలి రోజు 60 స్క్రీన్లు మాత్రమే దక్కగా.. హిట్ టాక్ అనంతరం రెండో రోజు ఆ సంఖ్య 300కు పెరిగింది.
ఇవీ చూడండి: కోట్లలో పెట్టుబడులు పెడుతూ స్టార్టప్‌ల బాటలో సినీ తారలు
నిఖిల్ కార్తికేయ 2 సినిమాకు మంచి వసూళ్లు, తొలిరోజే 25 శాతం రికవరీ