ETV Bharat / entertainment

మరోసారి పాట పాడబోతున్న పవన్ - సూపర్ అప్డేట్ ఇచ్చిన తమన్​ - music director thaman og movie

PawanKalyan Song : పవన్ కల్యాణ్​ మరోసారి తన సినిమా కోసం పాట పాడబోతున్నారని తెలిసింది. సంగీత దర్శకుడు తమన్ ఈ విషయాన్ని చెప్పారు. ఆ వివరాలు.

మరోసారి పాట పాడబోతున్న పవన్ - అప్డేట్ ఇచ్చిన తమన్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 2:24 PM IST

OG Movie Update PawanKalyan Song : పవర్​ స్టార్​ పవన్‌ కల్యాణ్ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓజీ' ఓరిజినల్ గ్యాంగ్​స్టర్​. గ్యాంగ్‌స్టర్‌ మాఫియా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్​ దశలో దశలో ఉంది. తాజాగా ఈ మూవీ గురించి సంగీత దర్శకుడు తమన్‌ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. "ఓజీ స్క్రిప్ట్​ ప్రకారం పవన్‌ కల్యాణ్​తో సాంగ్​ పాడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ అవకాశాలను పరిశీలిస్తున్నాం" అని అన్నారు. దీంతో మరోసారి థియేటర్లలో పవన్‌ పాట వినొచ్చని ఫ్యాన్స్‌ ఆనందపడుతున్నారు.

ఇప్పటివరకు 9 సార్లు : ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌తో 'ఓజీ'పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఇప్పుడీ పాట అప్డేట్​తో అవి మరింత రెట్టింపు అయ్యాయి. ఇప్పటివరకు పవన్‌ తన సినిమాల కోసం 9 సార్లు పాటలను పాడారు. 'తమ్ముడు'లో రెండు (ఏం పిల్లా మాట్టాడవా, తాటి చెట్టు ఎక్కలేడు), 'ఖుషి'లో బయ్‌ బయ్యే బంగారు రవణమ్మ, 'జాని'లో రెండు (నువ్వు సారా తాగకురో, రావోయి మా ఇంటికి), 'గుడుంబా శంకర్‌'లో కిల్లీ కిల్లీ, 'పంజా'లో పాపారాయుడు, 'అత్తారింటికి దారేది'లో కాటమ రాయుడా, 'అజ్ఞాతవాసి'లో కొడకా కోటేశ్వరరావు పాటలు పాడి తన ఫ్యాన్స్​ను అలరించారు. కాగా, జపాన్‌ - ముంబయి నేపథ్యంలో 'ఓజీ' సినిమా రెడీ అవుతోంది. తమిళ భామ ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్​గా నటిస్తోంది. ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి, ప్రకాశ్‌ రాజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

ఇకపోతే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలతో కూడా అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. చివరిగా 'బ్రో' సినిమాతో తెలుగు ఆడియెన్స్​ ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలలో నటిస్తున్నారు. ఏపీ ఎలెక్షన్స్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో షూటింగ్స్​లకు కాస్త బ్రేక్ ఇచ్చారు పవన్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఫొటో మూమెంట్​ - మెగా వారసులతో చిరు సెల్ఫీ

వీళ్లు సౌత్​ ఇండియన్ ఫిల్మ్​ సూపర్ హీరోస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.