ETV Bharat / entertainment

'అన్‌స్టాపబుల్ 2'లో ట్రిపుల్ ధమాకా.. ఇద్దరు రాజకీయ నాయకులతో రాధిక - అన్‌స్టాప‌బుల్‌ 2 కొత్త ఎపిసోడ్​

నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్​స్టాపబుల్​ 2' కొత్త ఎపిసోడ్​ కోసం వీక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కిరణ్​ కుమార్​ రెడ్డితో బాలయ్య ఉన్న ఫొటోను షేర్​ చేసిన ఆహా టీమ్.. ​తాజాగా ప్రముఖ నటి రాధిక తీసిన సెల్ఫీను కూడా పంచుకుని క్లారిటీ ఇచ్చింది. ఆ సంగతులు..

balayya with actress radhika
అన్​స్టాపబుల్​ 2
author img

By

Published : Nov 17, 2022, 11:04 AM IST

Unstoppable 2 Update: 'అన్‌స్టాప‌బుల్‌ 2' కొత్త ఎపిసోడ్ ఎప్పుడు? ఈ గురువారం రాలేదేంటి? వంటి ప్రశ్నలకు నటి రాధికా శరత్ కుమార్ సెల్ఫీతో 'ఆహా' టీమ్ చెక్ పెట్టింది. నిజాం కాలేజీలో తనకు మిత్రులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిని బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయనున్నారని, వాళ్లిద్దరూ కొత్త ఎపిసోడ్‌కు అతిథులుగా వచ్చినట్లు ఇదివరకే ఆహా తెలిపింది. అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డితో పాటు రాధిక కూడా ఈ ఎపిసోడ్‌లో జాయిన్ అయ్యారని స్పష్టంగా తెలుస్తోంది.

ఇప్పుడు 'అన్‌స్టాప‌బుల్‌ 2' నాలుగో ఎపిసోడ్ మరింత ఆసక్తి రేపుతోంది. రాజకీయ నాయకులు ఇద్దరూ బాలకృష్ణకు స్నేహితులు. కాలేజీ నుంచి రాజకీయాల వరకు ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్లతో పాటు రాధిక ఏం మాట్లాడారు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. త్వరలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. వచ్చే గురువారం స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

balayya with actress radhika
అన్​స్టాపబుల్​ 2

24 గంటల్లో 10 లక్షల వ్యూస్​..
'అన్‌స్టాప‌బుల్‌' రెండో సీజన్ సెన్సేషన్​ క్రియేట్ చేస్తోంది. బాలకృష్ణ జోరు వెండితెరపై మాత్రమే కాదు.. బుల్లితెరపై కూడా దుమ్మురేపుతోంది. ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్స్, యూట్యూబ్‌లో ప్రోమోస్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయని ఆహా వెల్లడించింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చిన ఎపిసోడ్​ను రాజకీయ, సినిమా వర్గాలు వీక్షించాయి. యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ ఎపిసోడ్ బావుందనే పేరూ వచ్చింది. శర్వానంద్, అడివి శేష్ ఎపిసోడ్ అయితే అందరినీ ఎంటర్‌టైన్ చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.