నటసింహ బాలకృష్ణ వేగం పెంచారు. అటు బుల్లితెర.. ఇటు వెండితెరపై అదరగొట్టేస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 'అఖండ'తో ఘన విజయం సొంతం చేసుకున్న బాలయ్య.. మరో క్రేజీ ప్రాజెక్టు 'ఎన్బీకే 107'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. సంక్రాంతి కానుకగా సినిమా లోగోను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 21న రాత్రి 8 గంటల 15 నిమిషాలకు కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఈ సినిమా లోగో ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
'ఎన్బీకే 107' సినిమాను 'అఖండ' విడుదలైన డిసెంబర్ 2న విడుదల చేయాలనే ప్లాన్ చేశారు మేకర్స్. ఒకవేళ అది కాకపోతే.. సంక్రాంతి బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నారు. 12 జనవరి 2023న ఈ సినిమా విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో లేడీ పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ బాణీలు అందిస్తున్నారు.
ఇవీ చదవండి : 'మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది'.. హీరోయిన్‌తో ప్రేమ.. అల్లు శిరీష్ స్పందన
బేబీ బంప్ ట్రెండ్.. ఖరీదైన బైక్‌పై ప్రెగ్నెంట్ లేడీ ఫొటోషూట్