ETV Bharat / entertainment

ఓటీటీలో నయన్ పెళ్లి వీడియో.. కోట్లు పెట్టి కొన్న నెట్​ఫ్లిక్స్​.. టీజర్ చూశారా? - నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌

Nayanthara Documentary Netflix : తమిళ ముద్దుగుమ్మ నయనతార.. దర్శకుడు విఘ్నష్ శివన్​ల పెళ్లి జూన్​లో జరిగింది. వివాహానికి సంబంధించిన వీడియోలు ఇంతవరకు బయటకు రాలేదు. ఇప్పుడు ఆ వీడియోను డాక్యుమెంటరీ రూపంలో తీసుకొస్తున్నారు ఈ జంట. దీనికి భారీ మొత్తాన్ని చెల్లించి నెట్​ఫ్లిక్స్​ కొనుగోలు చేసింది. తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్​ నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్​ అయింది.

Nayanthara Vignesh Shivan wedding
Nayanthara Vignesh Shivan wedding
author img

By

Published : Sep 25, 2022, 8:47 AM IST

Nayanthara Documentary Netflix : కథానాయిక నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. జూన్‌ 9న మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో చాలా విలాసవంతంగా జరిగిన ఈ పెళ్లికి భారీగానే ఖర్చు చేసినట్లు తెలస్తోంది. కానీ పెళ్లి ఎలా జరిగింది? ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అభిమానులు చూడలేకపోయారు. ఈ జంట కాస్త కొత్తగా ఆలోచింది పెళ్లిని 'నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌' పేరుతో ఓ డాక్యుమెంటరీగా సిద్ధం చేసింది.

దీనికి ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించడం విశేషం. తాజాగా ఈ పెళ్లి డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది. ఇందులో నయన పెళ్లికి సిద్ధం కావడం, విఘ్నేష్‌ శివన్‌.. నయనతో ఎలా ప్రేమలో పడ్డారో చెప్పడం లాంటి విషయాలను చూడొచ్చు. పూర్తి డాక్యుమెంటరీలో నయనతార చిన్నతనం నుంచి పెళ్లి వరకూ సాగే ప్రయాణాన్ని చూపించనున్నారు. పెళ్లి వేడుక డిజిటల్‌ రైట్స్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌ రూ.25 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ డాక్యుమెంటరీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేది మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు హీరోయిన్​.. గుర్తుపట్టగలరా?

'శిక్షణలో వేలు విరిగింది.. అయినా భరించి సినిమా చేశా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.