ETV Bharat / entertainment

బాలకృష్ణకు మరో సర్జరీ.. నిజమేనా? - బాలకృష్ణకు సర్జరీ

Balakrishna surgey: ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న నందమూరి బాలకృష్ణకు మరో సర్జరీ జరిగిందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఇందులో నిజమెంత?

Balakrishna surgery
బాలకృష్ణకు మరో సర్జరీ
author img

By

Published : Apr 26, 2022, 8:39 AM IST

Updated : Apr 26, 2022, 11:45 AM IST

Balakrishna surgey: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గోపిచంద్​ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్​ ఫిల్మ్​ చేస్తున్న ఆయన త్వరలోనే ఫన్​ డైరెక్టర్​ అనిల్​ రావిపూడితో ఓ చిత్రం చేయనున్నారు. అయితే ఇటీవలే భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనకు తాజాగా మరో శస్త్రచికిత్స నిర్వహించినట్లు ప్రస్తుతం జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించిన ఫొటో కూడా నెట్టింట్లో వైరల్​గా మారింది. గత కొద్ది రోజులుగా బాలయ్య మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, అందుకే సర్జరీ కూడా చేయించుకున్నారని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని ఆయన ప్రతినిధులు తెలిపారు. ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే హాస్పిటల్​కు వెళ్లారని చెప్పారు. మంగళవారం ఆయన సారథి స్టూడియోస్​లో గోపిచంద్​ మలినేనితో చేస్తున్న సినిమా షూటింగ్​లో పాల్గొన్నట్లు వెల్లడించారు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరారు.

కాగా, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై యాక్షన్ ఎంటర్​టైన్మెంట్​గా గోపిచంద్​-బాలయ్య సినిమా తెరకెక్కుతోంది. ​ నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. శ్రుతిహాసన్‌ కథానాయిక. వరలక్ష్మీ శరత్​కుమార్​ కీలక పాత్ర పోషించగా.. కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

balayya
రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్​ వెళ్లిన బాలయ్య

ఇదీ చూడండి: అప్పుడు అవమానం జరిగింది.. చాలా బాధ పడ్డా: చిరు

Last Updated : Apr 26, 2022, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.