ETV Bharat / entertainment

ఓటీటీలో 'వీరసింహారెడ్డి' గర్జన​.. స్ట్రీమింగ్​ ఆ రోజే.. ఏ ప్లాట్​ఫామ్​లో అంటే? - వీరసింహారెడ్డి న్యూస్​

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్​ను షేక్​ చేసిన నట సింహం బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' మూవీ త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​ ప్రకటించింది. ఇంతకీ ఓటీటీ రిలీజ్​ ఎప్పుడంటే?

veera simha reddy ott release
veera simha reddy ott release
author img

By

Published : Feb 12, 2023, 12:05 PM IST

'వీర‌సింహారెడ్డి' సినిమాతో సంక్రాంతి బరిలో తన జోరు చూపించారు నట సింహం నందమూరి బాలకృష్ణ. జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్లు కొల్లగొట్టింది. థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఇప్పడు ఓటీటీలో సందడి చేయనుంది. కాగా ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను రిలీజ్‌కు ముందే డిస్నీ ప్ల‌స్‌ హాట్‌స్టార్ దాదాపు రూ.15 కోట్ల‌కు సొంతం చేసుకుంది. ఈ మేరకు ఫిబ్ర‌వ‌రి 23 సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ట్విట్టర్​ వేదికగా డిస్నీ సంస్థ ప్ర‌క‌టించింది. దీంతో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక స్ట్రీమింగ్​ కోసం వెయిట్​ చేస్తున్నారు.

కాగా బాల‌కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫ్యాక్ష‌నిజం నిర్మూలించి రాయ‌ల‌సీమ‌ను అభివృద్ధి ప‌థంలో న‌డిపించాల‌ని న‌మ్మిన వీర‌సింహారెడ్డి అనే ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌లో బాల‌కృష్ణ న‌టించారు. ఆయన క్యారెక్ట‌రైజేష‌న్‌, హీరోయిజం అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. థియేటర్లో అయితే ఇక జనాలు జై బాలయ్య అంటూ కేరింతలు కొట్టారు. కాగా, అన్నా చెల్లెళ్ల ప‌గ‌, ప్ర‌తీకారాల‌ నేపథ్యంతో రాయలసీమ స్టైల్​లో తీసిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ బాక్సాఫీస్​ను షేక్​ చేసింది. ఈ సినిమాలో బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతిహాస‌న్, హ‌నీ రోజ్ న‌టించారు. బాల‌కృష్ణ సోద‌రిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ న‌టించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.