ETV Bharat / entertainment

ఆ పది నగరాల్లో నాగశౌర్య పాదయాత్ర.. ఫలితం దక్కుతుందా? - నాగశౌర్య పాదయాత్ర

కొత్త సినిమాతో త్వరలోనే యంగ్​ హీరో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. దానికి సంబంధించిన షెడ్యూల్​ను సోషల్​మీడియాలో పోస్ట్ చేశారు.

nagashoury pada yatra
నాగశౌర్య పాదయాత్ర
author img

By

Published : Sep 13, 2022, 5:09 PM IST

రాజకీయాల్లో పాద యాత్రలు చూశాం. కానీ ఇప్పుడు ఓ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం కోసం పాదయాత్ర జరగబోతుంది. ఆ సినిమానే 'కృష్ణ వ్రింద విహారి'. ఈ యాత్ర ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేయబోతున్నారు యువ హీరో నాగశౌర్య.

భిన్నమైన కథలతో ప్రత్యేకమైన ఇమేజ్​ను క్రియేట్​ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నాగశౌర్య. కానీ ఆయనకు కొంతకాలంగా సరైన బ్లాక్​ బస్టర్​ హిట్​ పడలేదు. అయితే ఇప్పుడాయన తాజాగా 'కృష్ణ వ్రింద విహారి' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా ఆసక్తిగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​ను డిఫరెంట్​గా ప్లాన్​ చేసింది మూవీటీమ్​. ఇందులో భాగంగానే హీరో నాగశౌర్య పది నగరాల్లో ఐదురోజుల పాటు పాదయాత్ర చేయబోతున్నారు. 14న తిరుపతితో ప్రారంభించి.. 15న నెల్లూరు, ఒంగోలు.. 16న విజయవాడ, గుంటూరు, ఏలూరు.. 17న భీమవరం, రాజమండ్రి.. 18న కాకినాడ, వైజాగ్​లో చేయబోతున్నారు. అయితే ఒక్కో రోజులో రెండు మూడు నగరాల్లో ఎలా పాదయాత్ర చేస్తారో చూడాలి మరి.

nagashoury pada yatra
నాగశౌర్య పాదయాత్ర

కాగా, ఈ చిత్రంలో షిర్లీ సేథియా కథానాయిక. ఉషా ముల్పూరి నిర్మాత. శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పకులు. మహతి స్వరసాగర్‌ స్వరకర్త. రాధిక, వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, కూర్పు: తమ్మిరాజు, కళ: రామ్‌ కుమార్‌. 23న సినిమా రిలీజ్​ కాబోతుంది.

ఇదీ చూడండి: పాక్​బౌలర్​తో రిలేషన్​.. పంత్​కు క్షమాపణ చెప్పిన ఊర్వశి రౌతేలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.