ETV Bharat / entertainment

'టెక్నాలజీని చూస్తే భయమేస్తోంది'- రష్మిక 'డీప్​ ఫేక్​' వీడియోపై నాగచైతన్య స్పందన - రష్మిక డీప్​ ఫేక్​ వీడియో రికాయక్షన్స్

Nagachitnya On Rashmika Deep Fake Video : సోషల్ మీడియాలో వైరల్​ అవుతోన్న నటి రష్మిక ఫేక్‌ వీడియోపై టాలీవుడ్​ హీరో నాగచైతన్య స్పందించారు. భవిష్యత్తులో టెక్నాలజీలో వస్తున్న మార్పులను తలచుకుంటే భయంగా ఉందన్నారు. అయితే ఈ విషయంపై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ విషయంపై స్పందించారు.

Nagachitnya On Rashmika Deep Fake Video
Nagachitnya On Rashmika Deep Fake Video
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2023, 12:32 PM IST

Updated : Nov 7, 2023, 1:25 PM IST

Nagachitnya On Rashmika Deep Fake Video : సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సృష్టించిన హీరోయిన్ రష్మిక మందన్న మార్ఫింగ్​ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విషయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించగా.. టాలీవుడ్​ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియా ప్లాట్​ఫామ్​ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. 'సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే చాలా నిరుత్సాహం కలుగుతోంది. భవిష్యత్తులో రాబోయే మార్పులను తలచుకుంటే మరింత భయంగా ఉంది. బాధితులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలి. కొత్త చట్టాన్ని తీసుకురావాలి' అని అందులో పేర్కొన్నారు. ఈ ట్వీట్​కు రష్మిక.. థ్యాంక్యూ అని రిప్లై పెట్టారు. నాగచైతన్యతో పాటు ప్రముఖ గాయని చిన్మయి కూడా ఈ వీడియోపై పోస్ట్ పెట్టారు. ఇలాంటి ఘటనలు చాలా ప్రమాదకరమని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఫేక్‌ వీడియోలను అరికట్టాలని కోరారు.

  • It’s truly disheartening to see how technology is being misused and the thought of what this can progress to in the future is even scarier.
    Action has to be taken and some kind of law has to be enforced to protect people who have and will be a victim to this .Strength to you. https://t.co/IKIiEJtkSx

    — chaitanya akkineni (@chay_akkineni) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చాలా బాధగా ఉంది : రష్మిక
అంతకుముందు.. రష్మక ఈ డీప్​ ఫేక్​ వీడియోపై ట్విట్టర్​లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. 'ఆన్​లైన్​లో వైరల్ అయిన నా డీప్​ ఫేక్​ వీడియో గురించి మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉంది. టెక్నాలజీ దుర్వినియోగం చేస్తూ ఇలాంటివి చేస్తే.. నాకే కాదు మనలో ప్రతి ఒక్కరికి భయంగానే ఉంటుంది. నాకు రక్షణగా, మద్దతుగా ఉన్న నా కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఈరోజు ఒక మహిళగా, నటిగా నా కృతజ్ఞతలు. ఇలాంటి ఘటన నా కాలేజీ లేదా స్కూల్​ రోజుల్లోనో జరిగితే.. నేను ఎలా ఎదుర్కొనేదాన్నో ఊహించలేను. ఇలాంటి ఐడెంటిటీ థెఫ్ట్​ వల్ల మనలో ఎక్కువ మంది ప్రభావితం అవుతాం. అందుకే మనందరం సంఘంగా కలిసి దీన్ని అత్యవసరంగా పరిష్కరించాలి.' అని రాసుకొచ్చారు.

స్పందించిన ప్రముఖులు.. ఎవరేమన్నారంటే...
ఈ ఫేక్ వీడియోపై బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​ మొదటగా స్పందించారు. ఆ తర్వాత ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరి దృష్టికి ఆకర్షించింది. దీనిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు.

"ఇలాంటి ప్రమాదకరమైన మిస్​ ఇన్​ఫర్​మేషన్​ను సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​ చర్యలు తీసుకోవాలి. ఇంటర్నెట్​ను ఉపయోగిస్తున్న అందరు డిజిటల్ నాగరికుల సేఫ్టీ, ట్రస్ట్​ కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది"
--రాజీవ్ చంద్ర శేఖర్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి

"నటి రష్మిక మందన్నను లక్ష్యంగా చేసుకున్న ఇటీవలి వైరల్​ అయిన డీప్‌ఫేక్ వీడియో.. ఇంటర్నెట్​లో మానిప్యులేటివ్​ నరేటివ్​ను బహిర్గతం చేసింది. ఇలాంటి సైబర్ బెదిరింపుల నుంచి భారతీయ మహిళలను రక్షించడానికి తక్షణ చర్య అవసరం"
-- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ (తెలంగాణ)

  • Recent deepfake targeting Actor Rashmika Mandanna exposes the alarming ease of narrative manipulation online. Urgent action is needed to safeguard Indian women from cyber threats.

    I appeal to Hon’ble President @rashtrapatibhvn, Hon’ble PM @narendramodi, Minister of Electronics…

    — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"బాలికలకు, సాధారణ ప్రజలకు డీప్‌ఫేక్‌ల ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి. ఇలాంటి సంఘటనలను జరిగినప్పుడు వారి విషయాలను వారే చూసుకోకుండా.. ( బయటి ప్రపంచానికి) నివేదించడానికి అత్యవసరంగా దేశవ్యాప్తంగా ఒక అవగాహన కార్యక్రమం స్టార్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను."
--చిన్మయి, ప్రముఖ గాయని

  • Several months ago, a video of one of our most favourite actors in an AI avatar performed to Kaavaalaa from Jailer released - only it wasn’t her. It was a Deep Fake.
    Nobody knows for sure whether Ms Simran had consented in advance to her likeness to be used in the Deep Fake AI…

    — Chinmayi Sripaada (@Chinmayi) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేంద్రం హెచ్చరిక..
ఇక ఈ వీడియోపై కేంద్ర ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య అని పేర్కొన్న ఐటీ శాఖ.. 36 గంటల్లోపు దీన్ని తొలగించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించింది.

స్టార్​ క్రికెటర్​తో డేటింగ్​- ఎట్టకేలకు స్పందించిన సారా, ఏమందో తెలుసా?

'ప్రభాస్​ కోసం అన్నీ వదిలేస్తా- ఎలా ఉన్నా పెళ్లి చేసుకుంటా!'

Last Updated : Nov 7, 2023, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.