Custody movie collections : స్టార్ హీరో నాగార్జున తనయుడిగా సినిమాల్లోకి వచ్చినా.. తనకంటూ మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు అక్కినేని నట వారసుడు నాగచైతన్య. కెరీర్ ప్రారంభం నుంచి తన నటనను మెరుగుపరుచుకుంటూ వస్తున్న ఆయన.. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుంటారు. గతేడాది ఆయన నటించిన 'థాంక్యూ', 'లాల్ సింగ్ చడ్డా' బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్‌ను అందుకోవాలని.. తమిళ డైరెక్టర్‌తో కలిసి ద్విభాషా చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వైవిధ్య కథలతో ప్రేక్షకులను అలరించే వెంకట్ ప్రభు తెరకెక్కించిన 'కస్టడీ' ప్రేక్షకుల్ని పలకరించారు. మే 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం డీసెంట్ టాక్‌ను అందుకుంది. అయితే కొంతమంది బాగుందని అంటుంటే మరికొంతమంది మాత్రం ఆశించిన స్థాయిలో లేదని కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ తొలి రోజు కలెక్షన్స్ వివరాలు బయటకు వచ్చాయి(అంచనా). అయితే ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని.. కాస్త నిరాశపరిచిందని సమాచారం. వరల్డ్ వైడ్‌గా రూ.4కోట్ల గ్రాస్ కన్నా తక్కువ వచ్చాయని తెలిసింది. ఇకపోతే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమాకు రూ. 2.30 నుంచి రూ. 2.50 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలిసింది. అలాగే.. తమిళంతో పాటు మిగతా ప్రాంతాలను కూడా కలిపితే మొత్తంగా రూ. 3.30 కోట్ల నుంచి రూ.3.50 కోట్ల వరకు వచ్చాయట.
-
#Custody disappoints with an estimated ₹4 Cr WW Gross on 1st Day. And the Reports are Below-par. pic.twitter.com/lOMZ4heP2q
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Custody disappoints with an estimated ₹4 Cr WW Gross on 1st Day. And the Reports are Below-par. pic.twitter.com/lOMZ4heP2q
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 13, 2023#Custody disappoints with an estimated ₹4 Cr WW Gross on 1st Day. And the Reports are Below-par. pic.twitter.com/lOMZ4heP2q
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) May 13, 2023
యూఎస్ఏలో తొలిరోజు ఇలా.. అలానే యూఎస్ఏలో ప్రత్యంగిరా సినిమాస్ కస్టడీ చిత్రాన్ని విడుదల చేసింది. అక్కడ తొలి రోజు(ప్రీమియర్స్‌తో కలిపి) లక్ష డాలర్స్ మార్క్‌ను క్రాస్ చేసిందని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది. లక్ష 15 వేల డాలర్స్‌ను అందుకుంది. 115కే డాలర్స్ వచ్చాయని తెలిపింది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని చెప్పింది.
ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు అరవింద స్వామి, ఆర్.శరత్‌కుమార్, ప్రియమణి, సంపత్‌రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. నాగచైతన్య, అరవింద స్వామి నటన అదిరిపోయిందని అంటున్నారు. కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. యువన్ శంకర్ రాజా, ఇళయరాజా సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ- ఎస్.ఆర్.కతిర్, ఎడిటింగ్- వెంకట్ రాజీన్, సంభాషణలు- అబ్బూరి రవి అందించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వెంకట్ ప్రభు అందించారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.22కోట్ల వరకు జరిగిందట.
-
The Blockbuster Hunt begins 💥#Custody USA Day 1 (including premieres) $115K+ and counting… @ 7.30 AM PST on 5/12 Friday
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Book your tickets now
USA Release by @PrathyangiraUS @chay_akkineni @IamKrithiShetty @vp_offl @thearvindswami @SS_Screens @srinivasaaoffl… pic.twitter.com/DG4n6fmwsW
">The Blockbuster Hunt begins 💥#Custody USA Day 1 (including premieres) $115K+ and counting… @ 7.30 AM PST on 5/12 Friday
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 12, 2023
Book your tickets now
USA Release by @PrathyangiraUS @chay_akkineni @IamKrithiShetty @vp_offl @thearvindswami @SS_Screens @srinivasaaoffl… pic.twitter.com/DG4n6fmwsWThe Blockbuster Hunt begins 💥#Custody USA Day 1 (including premieres) $115K+ and counting… @ 7.30 AM PST on 5/12 Friday
— Prathyangira Cinemas (@PrathyangiraUS) May 12, 2023
Book your tickets now
USA Release by @PrathyangiraUS @chay_akkineni @IamKrithiShetty @vp_offl @thearvindswami @SS_Screens @srinivasaaoffl… pic.twitter.com/DG4n6fmwsW
ఇదీ చూడండి: సమంతలా చేయను!.. నాగచైతన్య మంచి వ్యక్తి : కృతిశెట్టి వైరల్ కామెంట్స్