ETV Bharat / entertainment

ఆస్కార్​ వేదికపై 'నాటు నాటు' లైవ్​ షో.. చరణ్​, ఎన్టీఆర్​ స్టెప్పులు! - నాటు నాటు ఆస్కార్​ వేడుకలు

ఆస్కార్​ వేదికపై 'నాటు నాటు' పాట లైవ్​ ప్రదర్శన ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆస్కార్​ నిర్వాహకులు స్పందించారు. మార్చి12న జరిగే​ వేడుకలో నాటు నాటు పాట లైవ్​ షో ఉంటుందని కన్ఫామ్​ చేశారు. దీంతో అభిమానులు ఫుల్​ ఖుషీ అవుతున్నారు

Etv Bharatnaatu-naatu-from-rrr-to-be-performed-at-oscars-2023-ceremony

author img

By

Published : Mar 1, 2023, 7:11 AM IST

Updated : Mar 1, 2023, 8:31 AM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం ఆర్ఆర్​ఆర్​. విడుదలైన మొదటి రోజు నుంచే సూపర్​ హిట్​ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్​ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతే కాకుండా ఎన్నో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో నాటు నాటు పాట.. బెస్ట్​ ఒరిజినల్​ సాంగ్​ క్యాటగిరీలో ఆస్కార్​ నామినేషన్​ కూడా దక్కించుకుంది.

అయితే మార్చి 12న ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. కాగా, ఆ వేడుకల్లో నాటు నాటు పాట లైవ్​ ప్రదర్శన ఉంటుందని గత కొద్దిరోజులగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఆస్కార్​ నిర్వాహకులు స్పందించారు. మార్చి 12న ఆస్కార్​ వేదికపై నాటు నాటు లైవ్​ షో ఉంటుందని ప్రకటించారు. గాయకులు రాహుల్ సిప్లిగంజ్​, కాలభైరవ ఈ పాటకు ప్రదర్శన ఇస్తారని వెల్లడించారు.

దీంతో అభిమానులు ఫుల్​ ఖుషీ అవుతున్నారు. నాటు నాటుకు ఆస్కార్​ పక్కా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరికొందరు.. ఈ ప్రదర్శనలో హీరోలు రామ్​చరణ్​, జూనియర్​ ఎన్టీఆర్​ స్టెప్పులు వేస్తే చూడాలని ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరేం జరుగుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాలి.

కాగా, నాటు నాటు ప్రపంచవ్యాప్తంగా పుల్​ క్రేజ్​ సంపాదించుకుంది. ఈ పాటకు ఇప్పటికే ఎంతో మంది డ్యాన్స్​ వేసి సందడి చేశారు. ఈ సినిమాలో నటించిన ఆలియా కూడా ఇటీవలే ముంబయిలో జరిగిన ఓ అవార్డుల వేడుకలో చిందులేసింది. తల్లై నాలుగు నెలలే అయినా ఈ పాటకు బాలీవుడ్​ బ్యూటీ డ్యాన్స్​ వేయడంతో అంతా ఆశ్చర్యపోయారు. అంతకుముందు, కొరియాలోని ఇండియా ఎంబసీ ఉద్యోగులు చిందులేశారు. కొరియన్​ వనితలు తమదైన శైలిలో స్టెప్పులేశారు. పురుషులు.. రామ్​చరణ్​, ఎన్టీఆర్​ గెట్​ప్స్​లో అదరగొట్టారు. ఈ వీడియో చూసి ప్రధాని మోదీ కూడా మురిసిపోయారు. నాటు నాటు ప్రతిష్ఠాత్మక గోల్డెన్​ గ్లోబ్​ అవార్డుతోపాటు హాలీవుడ్​ క్రిటిక్స్​ అసోసియేషన్​ అవార్డు కూడా గెలుచుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. ఆలియాభట్‌, అజయ్‌ దేవగణ్​, శ్రియ, ఒలివియా మోర్రీస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది.

Last Updated : Mar 1, 2023, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.