ETV Bharat / entertainment

Adipurush 3D Movie : త్రీడీలో హైలైట్​ సీన్స్ ఇవేనంట! - ఆదిపురుష్​ త్రీడీ మూవీ

Adipurush 3D Movie : మైథలాజికల్​ మూవీ 'ఆదిపురుష్' మరో మూడు రోజుల్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. సోషల్​ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే ట్రెండ్. ఇక ఈ సినిమా 2డీతో పాటు 3డీలోనూ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో 3డీలో హైలైట్​గా నిలిచిన సీన్స్​ ఇవేనట!

Adipurush
Adipurush
author img

By

Published : Jun 13, 2023, 11:30 AM IST

Adipurush 3D Movie : ఎక్కడ చూసినా ఇప్పుడు 'ఆదిపురుష్'​ గురించే ప్రస్తావన. మరో మూడు రోజుల్లో సందడి చేయనున్న ఈ సినిమాను వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కాంట్రవర్సీలతో మొదలై ఇప్పుడు భారీ స్థాయిలో పాజిటివిటీని అందుకుంది. టీజర్ తర్వాత రిలీజైన ట్రైలర్స్​, 'జై శ్రీ రామ్', 'రామ్ సీతా రామ్'​ లాంటి సాంగ్స్ సినిమా రేంజ్​ను పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు రెండు మూడు రోజుల నుంచి సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

త్రీడీలో హైలైట్స్ ఇవే..
Adipurush 3D Shows : ఈ మూవీ 2డీతో పాటు త్రీడీలోనూ రిలీజ్​ కానుంది. అయితే టీజర్​, ట్రైలర్ చూసిన అభిమానులకు సినిమా ఎలా ఉండనుందో ఓ అంచనాకు వచ్చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన రెండు ట్రైలర్స్​లో రాముడు-సీత మధ్య ఉన్న భావోద్వేగ ప్రేమ సన్నివేశాలు, సీత అపహరణ, లంకా దహనం, రావణ సంహారం లాంటి ఎపిసోడ్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ ప్రముఖ వెబ్​సైట్​ ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసిన రివ్యూలో.. సినిమాలో ఏఏ సన్నివేశాలు హైలైట్​గా ఉండనున్నాయి, ముఖ్యంగా 3డీలో ఆకట్టుకునే సన్నివేశాలు ఏంటనేది తెలిపింది. వాలి-సుగ్రీవుల ఘర్షణ, శూర్పణఖ సీన్స్​, రాఘవ-ఖర పోరాట సన్నివేశం, హనుమంతుడు లంకను దహించే సన్నివేశం​, అలాగే సేతు నిర్మాణంతో పాటు​ రామ-రావణ యుద్ధం.. ఇలాంటి సన్నివేశాలు త్రీడీలో వీక్షిస్తే ఆ ఫీల్​ అదిరిపోయిందంటూ ఆ సంస్థ వెల్లడించింది. ఇది పక్కా 3 డీ సినిమా మెటేరియల్​ అని రాసుకొచ్చింది. దీంతో అభిమానులు ఈ సినిమాను​ త్రీడీలోనే చూసేందుకు ఉత్సుకత చూపిస్తున్నారు.

Adipurush 3D Movie
ఆదిపురుష్​ త్రీడీ మూవీ హైలైట్స్

నెగటివ్​గా ఉమైర్​ సంధు.. అంతకుముందు బాలీవుడ్​ సినీ విశ్లేషకుడు ఉమైర్​ సైంధు 'ఆదిపురుష్' ​ఫస్ట్​ రివ్యూను పోస్ట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. సినిమా ఏ మాత్రం బాలేదంటూ ట్విట్టర్​ వేదికగా వివాదాస్పద ట్వీట్స్​ చేశాడు. వాస్తవానికి అతడు ప్రతి సినిమాకు ఇచ్చిన రివ్యూకు భిన్నంగా మూవీ టాక్​ వస్తుంటుంది. దీంతో సినీ ప్రియులు.. ఫేక్​ రివ్యూస్ ఇవొద్దంటూ అతడిని హెచ్చరిస్తున్నారు.

  • First Review #Adipurush = 500 cr in the Dustbin 🤮. 3 Hours Torture with Fake VFX & Bad Performances by all Actors. Shame on Makers for ruining religious film.

    ⭐️⭐️ pic.twitter.com/FstwbV8nit

    — Umair Sandhu (@UmairSandu) June 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

జోరందుకున్న బుక్కింగ్స్..
Adipurush Advance Bookings : జూన్​ 16న రిలీజ్ కానున్న ఈ సినిమాకు​ ఓవర్సీస్​తో పాటు దేశవ్యాప్తంగా బుకింగ్స్​ జోరుగా అవుతున్నాయి. ఇప్పటకే పలు ప్రాంతాల్లో టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడుపోతున్నాయట. కానీ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఇక ఈ సినిమాకు క్రేజ్​ రెట్టింవుతున్న నేపథ్యంలో పలువురు సినీ తారలు ముందుకొచ్చి భారీ స్థాయిలో టిక్కెట్లు కొనుగోలు చేసి పంచుతున్నారు. స్టార్​ డైరెక్టర్​ అభిషేక్​ అగర్వాల్​ 10 వేలు, హీరో రణ్‌బీర్‌ కపూర్‌ 10 వేలు, రామ్​చరణ్​ 10వేలు, మంచు మనోజ్​ 2500 టికెట్లు కొనుగోలు చేసి పేదలకు, అనాథాశ్రమాలకు పంచుతున్నారు. దీంతో సినీ ప్రియులకు.. ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.