ఆదివారం తన తల్లి అంజనాదేవి పుట్టిరోజు సందర్భంగా ట్విటర్ వేదికగా ఆమెతో దిగిన ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేసి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. "ఈరోజు మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు. జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాను అమ్మా. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని చిరంజీవి ట్వీట్ చేశారు. అభిమానులు కూడా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. మెగా ఇంట జరిగిన ఈ సంబరలకు ఫ్యామిలీ మొత్తం హాజరవ్వగా.. మెగా బ్రదర్స్ ముగ్గురూ ఉన్న ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రామ్‌చరణ్‌ను , ఆయన భార్య ఉపాసనను చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు.


ఇక ప్రస్తుతం చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.250కోట్లు వసూళ్లు చేసింది. తాజాగా ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడిన చిరంజీవి ఈ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే 'నాటు నాటు' పాట ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక కావడం దేశానికే గర్వకారణమని అన్నారు. మరోవైపు సుజిత్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించనున్న OG(#OG) సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. వీటి కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
