ETV Bharat / entertainment

సుకుమార్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌.. ఫొటో షేర్‌ చేసిన చిరు - chiranjeevi sukumar combined photos

వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మెగాస్టార్​ చిరంజీవి.. స్టార్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో నటించేందుకు మేకప్​ వేసుకున్నారు. సుకుమార్​తో కలిసి ఉన్న ఫొటోలను చిరంజీవి షేర్​ చేశారు.

Megastar Chiranjeevi
సుకుమార్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌
author img

By

Published : Apr 1, 2022, 3:50 PM IST

‘గాడ్ ఫాదర్‌’, ‘భోళాశంకర్‌’.. ఇలా వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నారు అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి. షూటింగ్స్‌ నుంచి ఏ మాత్రం విరామం దొరికినా ఆయన మరో పనిలో నిమగ్నమవుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రమోషన్స్‌తోపాటు మోహన్‌రాజా, మెహర్‌ రమేశ్‌, బాబీ చిత్రాల షూట్‌లో ఉన్న చిరంజీవి తాజాగా స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో కలిసి వర్క్‌ చేశారు.

Megastar Chiranjeevi
సుకుమార్‌తో మెగాస్టార్‌ చిరు
Megastar Chiranjeevi
సుకుమార్‌ మాట్లాడుతున్న మెగాస్టార్‌

అయితే, వీళ్లిద్దరూ కలిసి పనిచేసింది సినిమా కోసం కాదు.. ఓ యాడ్‌ షూట్‌ కోసమే. ఓ ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ప్రకటన కోసం చిరంజీవి రంగంలోకి దిగగా.. సుకుమార్‌ ఆ యాడ్‌ని రూపొదించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిరు కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. సుకుమార్‌ టాలెంట్‌ని మెచ్చుకున్నారు. 'దర్శకుడిగా సుకుమార్‌ ప్రతిభ అందరికీ తెలిసిందే. ఓ యాడ్‌ఫిల్మ్‌ కోసం ఆయన దర్శకత్వంలో నేను నటించాను. షూట్‌ని ఎంతగానో ఎంజాయ్‌ చేశా' అని చిరు తెలిపారు.

ఇదీ చూడండి: Mishan Impossible Review: సినిమా పేరు తప్పుగా రాసి.. ప్రేక్షకులను మెప్పించారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.