ETV Bharat / entertainment

ఉగాది ట్రీట్​.. చిరంజీవి 'భోళాశంకర్'​ రిలీజ్ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?

'వాల్తేరు వీరయ్య' సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం 'భోళా శంకర్‌'. తాజాగా ఈ సినిమా రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది.

author img

By

Published : Mar 21, 2023, 10:16 PM IST

Updated : Mar 21, 2023, 10:50 PM IST

Megastar Chiranjeevi Bholashankar release date fix
చిరంజీవి 'భోళాశంకర్'​ రిలీజ్ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడంటే?

సంక్రాంతికి వాల్తేరు పక్కా కమర్షియల్​ 'వాల్తేరు వీరయ్య' సినిమాతో బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​ బస్టర్​ హిట్​ను అందుకుని ఫుల్​ జోష్​లో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో.. ఆయన ఫ్యాన్స్​ కోసం అదే జోష్​లో ఉన్నారు. అయితే చిరు ప్రస్తుతం తన కొత్త సినిమాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే తన కొత్త చిత్రం భోళాశంకర్​ చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తున్నారు. దీని కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పక్కా కమర్షియల్​గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేశ్​ తెరకెక్కిస్తున్నారు. అసలే ఆయన.. హీరోల్ని తెరపై స్టైలిష్‌గా చూపించడంలో సిద్ధహస్తుడన్న సంగతి తెలిసిందే. అలానే ఆయన మరోసారి తన మార్క్‌ను ప్రదర్శిస్తూ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు.. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది.

సిస్టర్ సెంటిమెంట్​తో రూపొందుతున్న ఈ చిత్రం.. తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాలం'కు తెలుగు రీమేక్‌. ఈ సినిమాలో చిరుకు చెల్లిలిగా యంగ్ అండ్ టాలెంటెండ్​ హీరోయిన్​ కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే చిరుకు హీరోయిన్​గా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. అయితే తాజాగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.. మూవీటీమ్​ ఆడియెన్స్​కు ఒకరోజు ముందుగానే అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.

ఆగస్టు 11న ఈ చిత్రాన్ని వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్​ చేయబోతున్నట్లు సోషల్​మీడియా వేదికగా ట్వీట్ చేసింది. ఓ సరికొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో చిరంజీవి, కీర్తి సురేష్‌, మిల్కీ బ్యూటీ తమన్నా కలర్​ఫుల్ డ్రెస్​లలో కనిపించారు. ఇక ఈ ప్రకటనతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ.. జోష్​ పెరిగింది. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కావాలంటూ అడుగుతున్నారు. పోస్టర్​కు తెగ లైక్స్​ కొడుతూ.. 'పోస్టర్​ అదిరింది' అంటూ విపరీతంగా కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. రావు రమేష్‌, రఘుబాబు, రవిశంకర్‌, మురళీశర్మ, తులసి, వెన్నెల కిషోర్‌, శ్రీముఖి, ప్రగతి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం డూడ్లే అందిస్తున్నారు. మహతి స్వరసాగర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మార్తాండ్‌ కె.వెంకటేష్‌- కూర్పు, సత్యానంద్‌- కథా పర్యవేక్షణ, ఎ.ఎస్‌.ప్రకాష్‌- ప్రొడక్షన్‌ డిజైనర్‌, తిరుపతి మామిడాల- సంభాషణలు అందిస్తున్నారు.

Megastar Chiranjeevi Bholashankar release date fix
చిరంజీవి 'భోళాశంకర్'​ రిలీజ్ డేట్​ ఫిక్స్

ఇదీ చూడండి: ఏడుస్తూ ఫొటో పోస్ట్ చేసిన మృణాల్​ ఠాకూర్​.. ఫ్యాన్స్​లో టెన్షన్​.. అసలేమైందంటే?

Last Updated : Mar 21, 2023, 10:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.