'ఆదిపురుష్' టీజర్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని నటుడు మంచు విష్ణు తాజాగా స్పష్టం చేశారు. ఈ సినిమా టీజర్‌పై తాను మాట్లాడినట్లు చక్కర్లు కొడుతోన్న సోషల్‌మీడియా ప్రచారం సాగడంపై ఆయన స్పందించారు. "ఫేక్ న్యూస్!! నేను ఊహించిన విధంగానే 'జిన్నా' రిలీజ్‌కు ముందు కొంతమంది కావాలనే ఇలాంటి నెగెటివ్ వార్తలను ప్రచారం చేస్తున్నారు. నా డార్లింగ్ ప్రభాస్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. అంతకు మించి నాకేమీ వద్దు" అంటూ విష్ణు స్పష్టతనిచ్చారు.
భారీ బడ్జెట్‌తో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'ఆదిపురుష్'. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించారు. ఇటీవల విడుదలైన ఈసినిమా టీజర్ సినీ ప్రియుల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే 'జిన్నా' ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు.. 'ఆదిపురుష్' టీజర్‌పై స్పందించినట్లు పలు కథనాలు, సోషల్‌మీడియాలో పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ సినిమాను తాను భారీ స్థాయిలో ఊహించుకున్నానని, టీజర్ చూస్తే యానిమేటెడ్ మూవీలా ఉందని.. ఒక ప్రేక్షకుడిగా తాను మోసపోయానంటూ ఆయా పోస్టులు, కథనాల్లోని సారాంశం. దీనిపైనే తాజాగా విష్ణు స్పందించి.. తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు.
ఇదీ చూడండి: సీరియల్ హీరోయిన్గా ఎంట్రీ.. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్ కథానాయికగా!