ETV Bharat / entertainment

మంచు మనోజ్​ దంపతులకు గ్రాండ్​ వెల్కమ్​.. వేల మంది ఒకేసారి.. - మోహన్​బాబు బర్త్​డే వేడుకల్లో మనోజ్​ దంపతుల సందడి

హీరో మంచు మనోజ్​ దంపతులు తాజాగా తిరుపతి జిల్లాలో సందడి చేశారు. రెండో వివాహం చేసుకున్నాక తొలిసారి తిరుపతి జిల్లాలోని తమ విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్​కు వెళ్లిన ఈ జంటకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ వీడియో మీకోసం..

Manoj Mounika Reddy in tirupathi vidyanikethan school
తిరుపతి శ్రీ విద్యానికేతన్​లో మంచు మనోజ్​ దంపతులు
author img

By

Published : Mar 20, 2023, 9:14 PM IST

విలక్షణ నటుడు మంచు మోహన్​బాబు తనయుడు మంచు మనోజ్ తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు​. కొద్దిరోజుల క్రితమే రెండో వివాహం చేసుకున్న మనోజ్​.. తాజాగా తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి మొదటిసారి తిరుపతి జిల్లా రంగంపేటలోని తమ కుటుంబానికి చెందిన శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థను సందర్శించారు. అక్కడ ఈ జంటకు ఊహించని రీతిలో ఘన స్వాగతం పలికారు విద్యార్థులు.

కాగా, మనోజ్​ ఇటీవలే మాజీమంత్రి భూమా అఖిలప్రియ చెల్లెలు భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే ఆదివారం(మార్చి 19)మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా తమ విద్యా సంస్థైన శ్రీ విద్యానికేతన్​లో మోహన్​బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించింది శ్రీ విద్యానికేతన్‌ యాజమాన్యం. ఈ వేడుకలకు మనోజ్​ దంపతులు స్పెషల్​గా హాజరయ్యారు. పెళ్లి అయ్యాక తొలిసారి జంటగా వెళ్లిన వీరికి వేల సంఖ్యలో విద్యార్థులు వరుసలో నిలబడి చప్పట్లతో ఆహ్వానం పలికారు. అనంతరం కొత్త జంటతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అయితే ఈ సెలబ్రేషన్స్​కు సంబంధించిన ఓ వీడియోను మంచు మనోజ్​ తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​లో పోస్ట్​ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్​ అన్నా నీ నెక్స్ట్​ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

డాడీ బర్త్​డేకి విష్ణు ఫ్యామిలీ డుమ్మా..
మార్చి19 ఆదివారం మంచు మోహన్​బాబు తన 71వ ఏటలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్​లో బర్త్​డే సెలబ్రెషన్స్​ను గ్రాండ్​గా సెలబ్రేట్​ చేశారు కుటుంబ సభ్యులు. వీటికి సంబంధించిన ఫొటోలను మోహన్​బాబు కుమార్తె సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. అయితే ఈ వేడుకల్లో మోహన్​బాబు కొత్త కోడలు మౌనిక రెడ్డి సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచారు. మామయ్య పుట్టినరోజును తనే దగ్గరుండి జరిపించినట్లుగా కనిపించారు మౌనికా రెడ్డి. అంతకుముందు పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయితే మంచు లక్ష్మీ పోస్ట్​ చేసిన ఫొటోల్లో మోహన్​ బాబు భార్య నిర్మలాదేవి, కుమార్తె లక్ష్మి మంచు, మనవరాలు, కుమారుడు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. కానీ, ఈ సెలబ్రేషన్స్​లో మాత్రం మంచు విష్ణు కుటుంబం ఎక్కడా కనిపించలేదు. అయితే ఇది గమనించిన ఫ్యాన్స్​ మంచు విష్ణు అన్న ఫ్యామిలీ ఎక్కడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. ఇకపోతే బర్త్​డేను పురస్కరించుకుని కుటుంబ సభ్యులంతా మోహన్​బాబుకు సోషల్​ మీడియా వేదికగా బర్త్​డే విషెస్​ తెలిపారు. మరోపక్క తండ్రి పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్‌ ఓ భావోద్వేగమైన పోస్ట్‌ను షేర్​ చేసిన విషయం తెలిసిందే. 'నాన్న కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా.. లవ్ యూ..! అంటూ తండ్రికి విషెస్‌ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.