ETV Bharat / entertainment

ఏంటి పవన్​ కల్యాణ్​​ మార్షల్​ పోజు మంచు లక్ష్మీదా.. వైరల్​గా మారిన పోస్ట్ - machu laxmi martial arts photos

పవన్​ కల్యాణ్​ను ఉద్దేశిస్తూ.. మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్​ ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఆ సంగతులు..

manchu laxmi tweet on pawan kalyan
పవన్ కళ్యాణ్ పై మంచు లక్ష్మి ట్వీట్
author img

By

Published : Dec 14, 2022, 12:30 PM IST

మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న తెలుగు హీరో ఎవరంటే? అందరూ చెప్పే సమాధానం పవన్‌ కల్యాణ్‌. పలు చిత్రాల్లోనూ తన ప్రతిభను ప్రదర్శించారు. చాలా ఏళ్లుగా మార్షల్‌ ఆర్ట్స్‌కు దూరమైన పవన్‌ మళ్లీ ప్రాక్టీస్‌ను ప్రారంభించినట్టు ఇటీవలే సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. సంబంధిత ఫొటోను షేర్‌ చేయగా.. అది కాస్త ఫుల్​ వైరల్ అయింది. అభిమానులంతా ఫుల్​ ఖుషీ అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ గతంలో మార్షల్‌ ఆర్ట్స్‌ గురించి చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రాక్టీస్‌ను గుర్తు చేసుకున్నారు. 'అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదన్నా నీ ఫైర్‌', 'వింటేజ్‌ లుక్‌' అంటూ కామెంట్స్ చేశారు.

అయితే ఇప్పుడా ఫొటో మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం నటి మంచు లక్ష్మీ. ఎందుకంటే గతంలో మంచు లక్ష్మీ కూడా అచ్చం పవన్ స్టైల్​లో​ ఓ మార్షల్ పోజు ఇచ్చింది. అయితే అది అప్పుడు ఎవరికీ తెలీదు. కానీ ఇప్పుడా ఫొటోను ఓ నెటిజన్​ వెతికి తీసి​.. పవన్​ మార్షల్​ ఫొటోకు జత చేసి పోస్ట్​ చేశాడు. అంతేకాదు పవన్​ను విమర్శిస్తూ ఓ వ్యాఖ్య కూడా రాసుకొచ్చాడు. ఆ పోస్ట్​నే తాజాగా మంచు లక్ష్మీ తన ట్విటర్​ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది చూస్తుంటే ఆమె పరోక్షంగా సెటైర్​ వేసినట్లు అర్థమవుతోంది. మంచో చెడో పవన్ పక్కన నా ఫోటో ఉండటం థ్రిల్లింగ్​గా ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఆ పోస్ట్​ ప్రస్తుతం సోషల్​మీడియాలో చర్చనీయాంశమైంది.

manchu laxmi tweet on pawan kalyan
పవన్ కళ్యాణ్ పై మంచు లక్ష్మి ట్వీట్

కాగా, 'భీమ్లా నాయక్‌'తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ చిత్రంలోని పాత్ర కోసమే పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ సాధన చేస్తున్నారు. 17వ శతాబ్దంనాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ కథానాయిక. 'సాహో' ఫేం సుజిత్‌ డైరెక్షన్‌లో పవన్‌ ఓ చిత్రం ఖరారు చేశారు. హరీశ్‌ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.