ETV Bharat / entertainment

'సర్కారు వారి పాట' ట్రైలర్​ రికార్డు.. ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ప్లాన్​! - సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్​

Sarkaruvaaripaata trailer record: మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' ట్రైలర్​ అరుదైన రికార్డు సాధించింది. అత్యంత వేగంగా 25 మిలియన్​ వ్యూస్​ దక్కించుకున్న తెలుగు ట్రైలర్​గా రికార్డును అందుకుంది.

mahesh babu sarkaru vari pata trailer record
మహేశ్​ బాబు సర్కారు వారి పాట ట్రైలర్​ రికార్డు
author img

By

Published : May 3, 2022, 12:23 PM IST

Sarkaruvaaripaata trailer record: సుపర్​స్టార్ మహేశ్​బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మే 12న చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మే 2న ట్రైలర్​ విడుదల చేసిన చిత్రబృందం. ఇప్పుడీ ఈ ప్రచార చిత్రం​ యూట్యూబ్​ను షేక్ చేస్తోంది. విడుదలైన 19 గంటల్లోనే.. 25 మిలియన్​ వ్యూస్​ను క్రాస్​ చేసి రికార్డు సృష్టించింది. యూట్యూబ్​లో నెం.1 స్థానంలో ట్రెండ్​ అవుతోంది. అంతకుముందు 'రాధేశ్యామ్'​(24 గంటల్లో 23.20 మిలియన్​ వ్యూస్​) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టింది. దీంతో రాధేశ్యామ్​ రెండో స్థానానికి పడిపోగా.. ఆచార్య(21.86), బాహుబలి 2(21.81), ఆర్​ఆర్​ఆర్​(20.45), కేజీఎఫ్ 2 తెలుగు డబ్​(19.38) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక విడుదలైన ఈ ట్రైలర్​లో మహేశ్‌ క్లాస్‌ అండ్‌ మాస్‌ లుక్స్‌, ఆయన చెప్పిన డైలాగ్స్‌ అభిమానులను హుషారెత్తించేలా ఉన్నాయి. ఈ ప్రచార చిత్రంలో చూపించిన సన్నివేశాల్ని బట్టి యాక్షన్‌, కామెడీ, లవ్‌.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో సినిమా రూపొందినట్టు తెలుస్తోంది.

ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు సన్నాహాలు.. ఈ చిత్ర ప్రీ రిలీజ్​ ఈవెంట్​ నిర్వహించేందుకు మూవీటీమ్​ ప్లాన్​ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్​లోని యూసఫ్​గూడ పోలీస్​ గ్రౌండ్స్​లో నిర్వహిస్తారని సమాచారం. చీఫ్​ గెస్ట్​గా ఎవరు రాబోతున్నారో ఇంకా వివరాలు తెలియలేదు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఈ సినిమాను పరశురామ్‌ తెరకెక్కించగా.. కీర్తి సురేశ్‌ హీరోయిన్​గా నటించింది. నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. తమన్‌ సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'సర్కారు వారి 'ట్రైలర్'' వచ్చేసింది.. మహేశ్​కు మరో మాస్ హిట్!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.