ETV Bharat / entertainment

ఆ విషయంలో మహేశ్​-నమ్రతకు అస్సలు పడదట - మహేశ్​బాబు నమ్రత వివాదం

సూపర్​స్టార్​ మహేశ్​బాబు తనకు ఏ విషయంలో గొడవ వస్తుందో చెప్పారు నమ్రత. ఆ సంగతులు..

Mahesh babu namrata fighting
ఆ విషయంలో మహేశ్​-నమ్రతకు అస్సలు పడదట
author img

By

Published : Dec 17, 2022, 12:26 PM IST

పెళ్లి తర్వాత తన ప్రపంచమే మారిపోయిందని, మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి అని తెలిపారు సూపర్​స్టార్ మహేశ్​బాబు సతీమణి నమ్రత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన కెరీర్‌, వైవాహిక జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

"మహేశ్‌బాబు నేనూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా లైఫ్‌లోనే ఎంతో సంతోషకరమైన రోజది. సినిమాల్లోకి రాకముందు నేను మోడలింగ్‌ చేశాను. మోడలింగ్‌ బోర్‌ కొట్టడంతో సినిమా పరిశ్రమ వైపు వచ్చాను. నటిగా ప్రతి పనిని పూర్తిగా ఆస్వాదిస్తూ చేశాను. అప్పుడే మహేశ్‌ను కలిశాను. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. కాబోయే సతీమణి ఎలా ఉండాలనే విషయంలో తనకు స్పష్టమైన ఆలోచన ఉంది. అందుకే నేను సినిమాలకు దూరమయ్యా. పెళ్లి అయ్యాక కూడా నాకు అవకాశాలు వచ్చాయి. కాకపోతే నటించాలనే ఉద్దేశం నాకస్సలు లేదు. మహేశ్‌కు నాకూ మధ్య గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా అది పిల్లల విషయంలోనే ఉంటుంది. పిల్లలు తమకు ఏం కావాలన్నా ఆయన్నే అడుగుతుంటారు. ఆయన కాదు అనరు. నేను నో చెబుతుంటాను. అలా మా మధ్య సరదాగా వాదనలు జరుగుతుంటాయి" అని నమ్రత తెలిపారు. ఇక, మహేశ్‌ నటించిన పోకిరి అంటే తనకెంతో ఇష్టమని.. అందులో ఆయన చెప్పే పంచ్‌ డైలాగ్‌లు తనకెంతో నచ్చాయని చెప్పారు.

ఇదీ చూడండి: ఈ టాలీవుడ్ అల్లరి పిల్లను గుర్తుపట్టగలరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.