ETV Bharat / entertainment

జక్కన్న స్కెచ్ అదుర్స్​.. 3పార్టు​లుగా SSMB 29.. రామాయణం ఆధారంగా మహేశ్​ రోల్​!! - మహేశ్​ బాబు ssmb 29 అప్డేట్

మహేశ్​- రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న SSMB 29 సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మూవీలో రామాయణం ఆధారంగా మహేశ్​ రోల్​ ఉండనుందట. ఈ చిత్రం.. మూడు భాగాలుగా తెరకెక్కనుందట!

mahesh babu and rajamouli
mahesh babu and rajamouli
author img

By

Published : Apr 12, 2023, 6:21 PM IST

Updated : Apr 12, 2023, 8:30 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాలతో గ్లోబల్​ స్థాయిలో గుర్తింపు పొందారు. తన సినీ జర్నీలో ఎన్నో హిట్​ సినిమాలకు ప్రాణం పోసిన ఈ స్టార్​ డైరెక్టర్​.. 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. ఈ సినిమాకు ఆస్కార్​ వరించడంతో ఆయన పేరు మరింత మారుమోగిపోయింది. దీంతో అభిమానులు సైతం ఆయన నెక్స్ట్​ ప్రాజెక్ట్​ ఎలా ఉండనుందో అంటూ భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబుతో నెక్స్ట్​ ప్రాజెక్ట్​ను అనౌన్స్​ చేశారు. ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచర్​ సినిమాల తరహాలో ఈ కథ ఉండనుందని కూడా వెల్లడించారు.

ఇప్పటికే ఈ సినిమా గురించి అనేక ఊహాగానాలు నెట్టింట చక్కర్లు కొడుతున్న వేళ ఇప్పుడు మరో వార్త సోషల్​ మీడియాలో ట్రెండ్​ అవుతోంది. ఈ సినిమాలో మహేశ్​ బాబు క్యారెక్టర్ రామాయణంలోని హనుమంతుడి పాత్రను పోలి ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అడవుల్లో జరిగే అక్రమాలపై మహేశ్​ బాబు పోరాడనున్నారట. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంతో సాగనున్న ఈ సినిమా.. 2023 చివరి కల్లా పట్టాలు ఎక్కనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ అమెజాన్ అడవుల్లో మొదలు కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కోసం జక్కన్న.. హాలీవుడ్​ నుంచి భారీ వీఎఫ్ఎక్స్​​ టెక్నీషియన్స్​ను రంగంలోకి దింపనున్నారట.

మరోవైపు ఈ సినిమా కోసం సోనీ పిక్చర్స్ , డిస్నీ సంస్థలు పోటీ పడుతున్నాయట. ఇక సోనీ పిక్చర్స్​ అయితే ఏకంగా రాజమౌళితోనే చర్చలు జరిపినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాను మూడు భాగాల్లో తెరకెక్కించనున్నారన్న వార్తలు కూడా జోరందుకున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే అన్ని సినిమాలు తీసేసరికి ఈజీగా పదేళ్లు పడుతుందని సినీ వర్గాల అంచనా. ఇక ఈ సినిమాలో పలువురు ఫేమస్​ స్టార్స్​తో పాటు హాలీవుడ్​కు చెందిన స్టార్స్​ కూడా నటించనున్నారనే టాక్​ నడుస్తోంది.

ఇక మహేశ్​ బాబు సినిమాల లైనప్​ను చూస్తే.. ప్రస్తుతం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో ఓ సినిమాకు సైన్​ చేశారు. SSMB 28 అనే వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్​ దశలో ఉంది. కాగా ఈ సినిమాలో మహేశ్​ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. మరోవైపు యంగ్​ హీరోయిన్​ శ్రీలీల కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది.

Last Updated : Apr 12, 2023, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.