ETV Bharat / entertainment

పోకిరికి, ఎస్​ఎస్​ఎమ్​బీ 28కు ఉన్న ఈ లింక్​ తెలుసా - త్రివిక్రమ్​ శ్రీనివాస్​

హీరో మహేష్​​​ సినీ కెరీర్​లో ఏప్రిల్​ 28 తేదీ సెంటిమెంట్​ డేట్​ అనే చెప్పుకోవాలి. సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఇదే రోజు రిలీజ్​ చేసిన చిత్రం బాక్సాఫీస్​ను బద్దలు కొట్టడమే కాకుండా ఆయన స్టార్​డమ్​ను పెంచింది. ఇప్పుడు అదే రోజున మరో సినిమాను రిలీజ్​ చేసేందుకు సిద్ధమవుతున్నారు మహేశ్.​ మరీ ఆ సెంటిమెంట్​ ఏ మేరకు వర్కవుట్​ అవుతుందో చూడాలి.

SSMB28 RELEASE DATE
SSMB28 RELEASE DATE
author img

By

Published : Aug 19, 2022, 11:16 AM IST

Updated : Aug 19, 2022, 11:29 AM IST

అత‌డు,ఖ‌లేజా లాంటి సినిమాల తర్వాత మ‌హేష్‌బాబు, మాటల మాంత్రికుడు కాంబినేష‌న్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న హ్యాట్రిక్ సినిమా ఎస్​ఎస్​ఎమ్​బీ 28. గురువారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయడంతో ఎంబీ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. 2023 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది. కాగా ఏప్రిల్ 28 మ‌హేష్‌బాబు కెరీర్‌లో మ‌ర్చిపోలేని రోజు.

సరిగ్గా 2006లో ఇదే రోజున మహేష్​ సినీ కెరీర్​ను మలుపు తిప్పిన పోకిరి సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మ‌హేష్‌బాబు కెరీర్‌లో తొలి బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా స్టార్ హీరో ఇమేజ్‌ను తీసుకొచ్చింది.ఇటీవ‌లే మ‌హేష్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేయ‌గా అద్భుత‌మైన వ‌సూళ్ల‌ను సాధించింది. మహేష్ బాబుకు స్టార్ స్టేట‌స్ తీసుకొచ్చిన పోకిరి రిలీజ్ రోజున త్రివిక్ర‌మ్ సినిమాను రిలీజ్ చేయ‌బోతుండ‌టంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఎక్కువయ్యాయి.

సాధార‌ణంగా మ‌హేష్‌బాబు సెంటిమెంట్స్‌కు చాలా ప్రాధాన్య‌మిస్తరన్న విషయం అందరికి తెలిసిందే. మ‌రి పోకిరి సెంటిమెంట్ అత‌డికి ఏ మేర‌కు క‌లిసివ‌స్తుంద‌నేది చూడాలి. పోకిరి సెంటిమెంట్​ను త్రివిక్రమ్ మూవీ ఎంతవరకు తీసుకొస్తుందో వేచి చూడాల్సిందే. సినీ ఇండ‌స్ట్రీ హిట్స్‌లో ఒక‌టైన బాహుబ‌లి 2 కూడా ఏప్రిల్ 28నే రిలీజ్ అయింది.

టాలీవుడ్ వ‌ర్గాల‌కు క‌లిసివ‌చ్చిన డేట్ కావ‌డంతోనే మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ ఏప్రిల్ 28న త‌మ హ్యాట్రిక్ సినిమాను రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు రాగా అవి అవాస్తవాలంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

  • The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥

    The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨

    Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad

    — Haarika & Hassine Creations (@haarikahassine) July 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

మహేష్ త్రివిక్రమ్​ల కొత్త చిత్రం ఎప్పుడంటే

మళ్లీ హాట్​టాపిక్​గా సల్మాన్​ రెమ్యునరేషన్​, ఆ షోకు వెయ్యి కోట్లు పక్కానా

Last Updated : Aug 19, 2022, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.