ETV Bharat / entertainment

Kushi Movie Trailer : భర్త అంటే ఎలా ఉండాలో చూపిస్తానంటున్న విజయ్​.. లవ్ అండ్ ఎమోషనల్​గా 'ఖుషి' ట్రైలర్​ - శివ నిర్వాణ్ ఖుషి మూవీ

Kushi Movie Trailer : విజయ్ దేవరకొండ-సమంత కలిసి నటించిన ఖుషి మూవీ ట్రైలర్ రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంటోంది.

kushi movie trailer
విజయ్ దేవరకొండ ఖుషి ట్రైలర్
author img

By

Published : Aug 9, 2023, 3:48 PM IST

Updated : Aug 9, 2023, 4:05 PM IST

Kushi Movie Trailer : రౌడీ హీరో సెన్సేషనల్ స్టార్ విజయ్‌ దేవరకొండ- స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన చిత్రం కంప్లీట్ లవ్​ స్టోరీ 'ఖుషి'. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్​ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. సెప్టెంబర్‌ 1న రిలీజ్​కు రెడీ అయింది(kushi movie release date). విడుదల తేదీ దగ్గరపడడంతో ప్రమోషన్స్​లో జోరు పెంచిన మూవీటీమ్​.. సినిమా ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఓ ఈవెంట్​ను గ్రాండ్‌గా నిర్వహించి.. 2 నిమిషాల 41 సెకన్లు ఉన్న ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.

'దీనమ్మ కశ్మీర్ సేమ్ రోజా సినిమాలా ఉంది' అనే డైలాగ్​తో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. 'మీ గురించి తెలియదు కానీ బేగమ్​ మాత్రం డైరెక్ట్ స్వర్గ్​ సే ఆయే హై' అంటూ విజయ్ దేవరకొండ హిందీ-తెలుగు కలిపి మాట్లాడటం కాస్త ఫన్నీగా అనిపించింది. ఇక ఈ ప్రచార చిత్రంలో 'అర్జున్ రెడ్డి' డైలాగ్​ 'అది నా పిల్ల' అంటూ అనడం బాగుంది. ఈ క్రమంలోనే ఓ ట్విస్ట్​.. హీరోయిన్​ బేగమ్ కాదు బ్రహ్మిణ్​ అని చెప్పడం ఆ తర్వాత లవ్ స్టోరీ ఎంతో కూల్​గా సాగడం చూపించారు.

అయితే జాతకాల వల్ల ఇరు కుటంబంలోని వాళ్లు హీరోహీరోయిన్ పెళ్లి కుదరకపోవడం, దీంతో ఇంట్లో వాళ్లని కాదని ఇద్దరూ పెళ్లి చుసుకోని జీవినం సాగించడం, ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల సాఫీగా సాగుతున్న జీవితంలో గొడవలు ఎదురవ్వడం వంటివి చూపించారు. ఈ క్రమంలోనే 'పెళ్లంటేనే చావురా' అని రాహుల్ రామకృష్ణ అనడం, భర్త అంటే ఎలా ఉండాలో ఈ సమాజానికి చూపిస్తా అంటూ విజయ్ అనడం మంచి ఇంట్రెస్టింగ్​గా ఉంది. మరి చివరికి చిత్రంలో విజయ్​-సమంత కలిశారా లేదా అన్నది తెరపై చూడాల్సిందే..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Kushi Movie Director 2023 : ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, మూడు మెలోడీ సాంగ్స్​ అభిమానులను, సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ లవర్స్ అయితే ఈ సాంగ్స్‌ను అస్సలు వదలట్లేదు. సోషల్​మీడియాలో ఎక్కడ చూసిన ఇవే వినిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్, సమంత కలిసి గతంలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి' చిత్రంలో జంటగా కనిపించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు 'ఖుషి' చిత్రంలో రిలీజైన పోస్టర్స్​, సాంగ్స్​ ద్వారా.. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుందని కొనియాడుతున్నారు. వీరిద్దరి పెయిర్ ఎంతో క్యూట్​గా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 'మజిలీ', 'నిన్ను కోరి'తో ఇప్పటికే తన టాలెంట్​ను ప్రూవ్ చేసుకున్న శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అటు కథ పరంగా మనసుల్ని తాకాయి. కమర్షియల్​గానూ వసూళ్లను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు ఆయన నుంచి రానున్న మరో లవ్ స్టోరీ కావడంతో 'ఖుషీ'పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే విజయ్ దేవరకొండ చివరిసారిగా 'లైగర్' సినిమాతో ఆడియెన్స్​ను పలకరించారు. పాన్ ఇండియా లెవల్​లో వచ్చిన ఈ చిత్రం డిజాస్టర్​గా నిలిచింది. అలాగే సమంత 'శాకుంతలం' కూడా అట్టర్​ ఫ్లాప్ అయింది. దీంతో వీరిద్దరూ ప్రస్తుతం ఫ్లాప్​లో ఉన్నారు. ఇక వీరిద్దరూ గట్టి కమ్​బ్యాక్​ ఇవ్వాలంటే ఖుషి సినిమా భారీగా హిట్ అందుకోవాల్సిందే. అందుకే ఈ జంట.. ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.

ఇదీ చూడండి :

బ్రేక్ తర్వాత సమంత చేయబోయే మొదటి పని ఇదేనటా... ఆబ్బో ప్లానింగ్ బాగానే ఉందిగా!

సమంత మళ్లీ 'ఖుషి' ఖుషీ.. గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పిన విజయ్ దేవరకొండ!

Last Updated : Aug 9, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.