ETV Bharat / entertainment

యాంకర్​తో అసభ్య ప్రవర్తన.. నటుడిపై తాత్కాలిక నిషేధం - sreenath bhasi news

కేరళ నటుడిపై నిషేధం విధించింది ఆ రాష్ట్ర సినిమా నిర్మాతల సంఘం. సినిమా ప్రమోషన్​లో భాగంగా ఓ యాంకర్​తో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆ నటుడెవరంటే..

srinath bhasi
srinath bhasi
author img

By

Published : Sep 28, 2022, 1:53 PM IST

కేరళ నటుడు శ్రీనాథ్​ భాసీపై తాత్కాలిక నిషేధం విధించింది కేరళ చిత్ర నిర్మాతల సంఘం(కేఎఫ్​పీఏ). తన కొత్త సినిమా 'చత్తంబీ' ప్రమోషన్​ సందర్భంగా యూట్యూబ్​కు ఇచ్చిన ఇంటర్య్వూలో లేడీ యాంకర్​తో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీనాథ్​ తనను అసభ్య పదజాలంతో దూశించారని.. తన టీమ్​ సభ్యులను కూడా బూతులు తిట్టాడని యాంకర్​ ఆరోపించింది. అనంతరం బాధితురాలు మారడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనాథ్​ను అరెస్టు చేశారు. అనంతరం బెయిల్​పై శ్రీనాథ్ సోమవారం బయటకు వచ్చారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేఎఫ్​పీఏ కూడా అతడిపై తాత్కాలిక నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే శ్రీనాథ్​ మంగళవారం తమ ముందుకు వచ్చాడని.. తన తప్పును ఒప్పుకున్నాడని కేఎఫ్​పీఏ అధ్యక్షుడు ఎమ్​ రంజిత్​ తెలిపారు. దీంతో నిషేధాన్ని తాత్కాలికంగా విధించామని పేర్కొన్నారు. ఓ సినిమాకు ఒప్పందం కంటే అధిక పారితోషికం వసూలు చేశాడని కేఎఫ్​పీఏలో అతడిపై మరో ఫిర్యాదు నమోదైంది. దీనిపై స్పందించిన ఎమ్ రంజిత్​.. అధికంగా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వడానికి అతడు ఒప్పుకున్నాడని చెప్పారు. షూటింగ్​ జరుగుతున్న సినిమాలు పూర్తి చేసుకునేందుకు అతడికి అనుమతిస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: ఈ బ్యూటీకి వయసు తరుగుతోంది.. అందం పెరుగుతోంది

మహేష్​బాబు తల్లి మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.