ETV Bharat / entertainment

పింక్‌ చుడిదార్‌లో బొద్దుగా కత్రినా.. ప్రెగ్నెంట్​ అయ్యిందంటూ..! - katrina kaif pink dress

బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్‌ గర్భవతి అంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడతున్నాయి. తాజాగా ఆమె కనిపించిన తీరు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే ఈ వార్తలపై కత్రినా టీమ్​ ఏమన్నదంటే?

Katrina kaif- vicky
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌
author img

By

Published : May 13, 2022, 3:32 PM IST

Updated : May 13, 2022, 10:46 PM IST

పెళ్లైన తర్వాత ఏమాత్రం ఖాళీ దొరికినా.. భర్త విక్కీ కౌశల్​తో గడిపేందుకు ఇష్టపడుతోంది బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్‌. తాజాగా విక్కీ-కత్రినా కలిసి నడుస్తున్న ఫొటో ఒకటి సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది. ఆ ఫొటోను చూసిన నెటిజన్లు కత్రినా ప్రెగ్నెంట్​ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలో ఆమె పింక్‌ చుడిదార్‌ ధరించి.. బొద్దుగా, పొట్ట ముందుకు వచ్చినట్లు కనిపించింది. దీంతో కత్రినా కైఫ్‌ కచ్చితంగా గర్భవతి అయ్యిందంటూ.. కన్ఫర్మ్​ చేస్తున్నారు నెటిజన్లు.

అయితే ఆ వార్త సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం కావడం వల్ల.. కత్రినా టీమ్​ స్పందించింది. కత్రినా కైఫ్‌ ప్రెగ్నెంట్​ కాదని.. ఆ వార్తలు అవాస్తవమని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం విక్కీ-కత్రినా అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్​లో ఉన్న.. హీరోయిన్‌ ప్రియాంక చోప్రా రెస్టారెంట్‌కు వీరు వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను షేర్​ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది కత్రినా.

Katrina kaif- vicky
విక్కీ కౌశల్-కత్రినా కైఫ్‌

గతేడాది డిసెంబర్​లో రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్​లో విక్కీ-కత్రినా పెళ్లి జరిగింది. అప్పటి నుంచి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఇద్దరూ.. భర్తతో కలిసి వెకెషన్​కు వెళ్తోంది కత్రినా. అక్కడి ఆనంద క్షణాలను తన సోషల్​ మీడియాలో షేర్​ చేస్తుంది. విక్కీ కౌశల్‌ ప్రస్తుతం గోవిందా నామ్‌ మేరా, లక్ష్మణ్‌ ఉటెకర్‌ దర్శకత్వంతో ఓ సినిమా చేస్తున్నాడు. కత్రినా అయితే.. టైగర్‌-3తో పాటు విజయ్‌ సేతుపతితో ‘మేరీ క్రిస్టమస్‌’, జీ లే జరా సినిమాలు చేస్తోంది.

ఇదీ చదవండి: కాంగ్రెస్​లో 'ఒకే కుటుంబం- ఒకే పదవి​' రూల్.. సోనియా, రాహుల్, ప్రియాంక పరిస్థితి?

Last Updated : May 13, 2022, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.