ETV Bharat / entertainment

ఆకట్టుకుంటున్న కార్తికేయ-2 ట్రైలర్​.. నిఖిల్​, నాగ చైతన్య పోటాపోటీ! - nagachaitanya thankyou movie

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్తికేయ-2 ట్రైలర్​ వచ్చేసింది. నిఖిల్​, అనుపమ పరమేశ్వరన్​ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మరోవైపు అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న థ్యాంక్​ యూ విడుదల తేదీ ఖరారైంది.

Karthikeya 2 movie trailor thank you release date

author img

By

Published : Jun 24, 2022, 7:04 PM IST

Karthikeya 2 Trailor: సినీ ప్రియులంతా ఆసక్తి ఎదురుచూస్తున్న సినిమాల్లో 'కార్తికేయ 2' ఒకటి. నిఖిల్‌ కథానాయకుడిగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జులై 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఏఎంబీ సినిమాస్‌ స్క్రీన్‌- 3లో చిత్ర బృందం తొలి ట్రైలర్‌ను ఆవిష్కరించింది. సముద్రం దాచుకున్న ద్వారకా నగరం.. దాని వెనకున్న రహస్యాన్ని కనిపెట్టే కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌తో అర్థమైంది. దానికి సంబంధించి ట్రైలర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంది. 'అసలు కృష్ణుడు ఏంటి? ఈ కథను ఆయనే నడిపించటం ఏంటి?' అంటూ నిఖిల్‌.. 'విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే. ప్రతిదీ నీ మీద ప్రభావమే' అంటూ అనుపమ్‌ ఖేర్‌ చెబుతున్న సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నిఖిల్‌- చందూ కాంబినేషన్‌లో 2014లో వచ్చిన 'కార్తికేయ' మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి ఫ్రాంచైజీగా రూపొందుతుండటంతో 'కార్తికేయ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో నిఖిల్‌ సరసన అనుపమ పరమేశ్వరన్‌ కనిపించనుంది. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకాబోతోంది.

'థ్యాంక్​ యూ' విడుదల అప్పుడే: అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'థ్యాంక్‌ యూ'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. విభిన్న ప్రేమకథగా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జులై 22న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకం పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య మూడు భిన్నమైన లుక్స్‌తో కనిపించనున్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అవికాగోర్‌,మాళవిక నాయర్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్నారు.

Karthikeya 2 movie trailor thank you release date
థ్యాంక్​ యూలో నాగచైతన్య

దర్శకుడు పూరీజగన్నాథ్​ సోదరుడు సాయిరామ్​ శంకర్​ కొత్త సినిమాను ప్రకటించాడు. దొడ్డ నవీన్​ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యశా శివకుమార్​ కథానాయిక. సాయితేజ ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మిస్తోంది. సినిమా ముహూర్తం, పూజా కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్​తో పాటు నటులు అల్లరి నరేశ్​, శర్వానంద్​, విశ్వక్​ సేన్​, ఆకాశ్​ పూరీ పాల్గొన్నారు.

సాయిరామ్​ శంకర్​ కొత్త మూవీ
నితిన్​ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్​గా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం కొత్త పోస్టర్​ వచ్చింది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శ్రేష్ఠ్​ మూవీస్​ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎంఎస్​. రాజశేఖర్​ రెడ్డి దర్శకుడు.

మాచర్ల నియోజకవర్గం కొత్త పోస్టర్​

ఇవీ చూడండి: 'లవ్​స్టోరీ' నిర్మాత ఇంట పెళ్లి.. మెగా బ్రదర్స్​ సందడి.. తరలివచ్చిన తారాలోకం

నాగచైతన్య- కృతిశెట్టి కొత్త మూవీ లాంచ్​.. గెస్టు​లుగా శివ కార్తికేయన్​, రానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.