ETV Bharat / entertainment

కార్తికేయ 2 స్టోరీ వర్కౌట్, ఆమిర్​, అక్షయ్​ను నిఖిల్​ దెబ్బకొట్టాడుగా

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. పలుమార్లు వాయిదాలు పడిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్​ హిట్​ టాక్​ను సంపాదించుకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా అత్యధిక వసూళ్లతో దూసుకెళ్తోంది. అయితే దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో కృష్ణుడి ఆరాధన ఎక్కువ కనుక బీటౌన్​ ప్రేక్షకులకు సినిమా తెగ నచ్చేసిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

karthikeya 2 movie
karthikeya 2 movie
author img

By

Published : Aug 17, 2022, 9:18 AM IST

Karthikeya 2 Movie: "'కార్తికేయ2'ను హిందీలో సరదాగా విడుదల చేద్దామని 50 థియేటర్‌లలో విడుదల చేశారు. రెండో రోజున అది 200 థియేటర్లకు, ఇవాళ అది 700లకు పైగా థియేటర్‌లలో ఆడుతోంది. ఒక సినిమా భాషాపరంగా సరిహద్దులు దాటుకుని, ప్రజల గుండెల్లోకి వెళ్లింది. ఇలాగే 'పుష్ప' కూడా నెమ్మదిగా మొదలై, ఇరగొట్టేసింది" ఈ మాటలు అన్నదెవరో కాదు.. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌. ఈ గణాంకాలు చాలు, హిందీ ప్రేక్షకులు 'కార్తికేయ2'ను ఎంత ఆదరిస్తున్నారో చెప్పడానికి. బాలీవుడ్‌లో సొంత సినిమాలు ఒక్కొక్కటి వికటిస్తుంటే.. అదే సమయంలో దక్షిణాది సినిమాలు అక్కడ సత్తా చాటుతున్నాయి.

'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీయఫ్‌2', 'విక్రమ్‌'లు మెప్పించగా.. ఇప్పుడు 'కార్తికేయ2' వంతు వచ్చింది. తెలుగులో వైవిధ్య కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో అలరిస్తున్న యువ కథానాయకుడు నిఖిల్‌ కీలక పాత్రలో చందూ మొండేటి దీన్ని తెరకెక్కించారు. గత శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ క్రమంగా పుంజుకుంటోంది. తాజాగా ట్రేడ్‌ వర్గాల అంచనా ప్రకారం... 300 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. కేవలం ఒక్క సోమవారం నాడే రూ.6.50 కోట్లు వసూలు చేసింది.

మొత్తం మూడు రోజుల కలెక్షన్ల విషయానికొస్తే ఏకంగా రూ.17.55 కోట్లు (హిందీ/తెలుగు) రాబట్టినట్లు ట్రేడ్‌ లెక్కలు చెబుతున్నాయి. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడంతో హిందీలో స్క్రీన్‌లను పెంచే పనిలో పడ్డారు ఎగ్జిబిటర్స్‌. ఇది ఇలాగే కొనసాగితే సింగిల్‌ డే కలెక్షన్‌ రూ.కోటి వచ్చినా.. ఆశ్చర్యపోనవసరం లేదు. మరోవైపు సినిమా బడ్జెట్‌ రూ.15కోట్ల మార్కును 'కార్తికేయ2' దాటేసింది.

కథ వర్కవుట్‌ అయింది!
కృష్ణుడు, ద్వారకానగరం చుట్టూ కథను అల్లుకోవడంతోనే సగం విజయం సాధించింది చిత్ర బృందం. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో కృష్ణుడి ఆరాధన ఎక్కువ. ఈ నమ్మకంతోనే 'కార్తికేయ2'ను పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేశారు. తొలిరోజు నుంచే అక్కడి ప్రేక్షకులు సినిమాకు త్వరగానే కనెక్ట్‌ అయ్యారు. కథ చిన్నదే అయినా.. కృష్ణతత్వం చుట్టూ తిరిగే కథనం, సంభాషణలు అక్కడి వారిని మెప్పిస్తున్నాయి. పైగా, అనుపమ్‌ఖేర్‌లాంటి నటులు కూడా ఉండటం అదనపు ఆకర్షణ తెచ్చింది.

దీనికితోడు ఆమిర్‌ఖాన్‌ 'లాల్‌ సింగ్‌ చడ్డా', అక్షయ్‌ 'రక్షాబంధన్‌'లు బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోవడం కూడా ‘కార్తికేయ2’కు కలిసొచ్చింది. బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా 'కార్తికేయ2' విడుదలైంది. చాలా మందికి ఇది సీక్వెల్‌ అన్న విషయం కూడా తెలియదు. ఆమిర్‌, అక్షయ్‌ల ముందు ఇది నిలబడుతుందా? అన్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ, వాళ్ల సినిమాలు ఆడుతున్న స్క్రీన్స్‌ తగ్గుతుండగా, 'కార్తికేయ2' షోలు పెరుగుతుండటం గమనార్హం. గతంలో అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' కూడా ఎలాంటి అంచనాలు లేకుండా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఒక్కో రోజు స్క్రీన్‌లను పెంచుకుంటూ 'పుష్కరాజ్‌' బాలీవుడ్‌కు కిక్కెక్కించాడు. ఇప్పుడు అదే బాటలో 'కార్తికేయ2' కూడా నడుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: ఉత్కంఠగా హైవే ట్రైలర్, శర్వానంద్​ మూవీ నుంచి కొత్త పాట

ఎన్టీఆర్​ దైవాంశ సంభూతుడు, ఇవే సాక్ష్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.