ETV Bharat / entertainment

'ఆ చిరు ప్రయత్నమే 'కార్తికేయ 2'.. వారికి కూడా ఈ చిత్రం అర్థమవుతుంది' - కార్తికేయ 2 మూవీ

'ప్రేమమ్‌', 'సవ్యసాచి' సినిమాలతో సినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి పంచిన దర్శకుడు చందూ మొండేటి.. ఇప్పుడు 'కార్తికేయ 2'తో థ్రిల్‌ పంచేందుకు సిద్ధమయ్యారు. శనివారం 'కార్తికేయ 2' సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చందూ పలు విశేషాలను తెలిపారు. అవి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 10, 2022, 8:55 PM IST

Karthikeya 2 Movie Director: చందు మొండేటి.. తొలి చిత్రం 'కార్తికేయ'తో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు. 'ప్రేమమ్‌', 'సవ్యసాచి' సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. ఇప్పుడు 'కార్తికేయ 2'తో థ్రిల్‌ పంచేందుకు సిద్ధమయ్యారు. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చందు తెరకెక్కించిన ఈ సినిమా శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చందు పలు విశేషాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

అంచనాలకు తగ్గట్టు..
విజయవంతమైన చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. కథ, విజువల్స్‌.. ఇలా అన్ని విషయాల్లోనూ వారు ఏం ఆశిస్తారో అంచనా వేసుకొని దానికి తగ్గట్టు తెరకెక్కించాల్సి వస్తుంది. 'కార్తికేయ' క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సీక్వెల్‌ రూపొందించా. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

karthikeya 2 movie
కార్తికేయ 2

శ్రీ కృష్ణుడి గురించి..
అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకోవడం, అడ్వెంచర్ కథలు చదవటమంటే నాకు బాగా ఇష్టం. వాటితోపాటు మహాభారతం, రామాయణం చదువుతూ పెరిగా. ఆ ఇతిహాసాలకు నాదైన శైలిలో థ్రిల్లింగ్‌ అంశాలు జోడించి సినిమాలు చేయాలనుకుంటుంటా. అలా శ్రీ కృష్ణుడి గురించి ఈ సినిమాలో చెప్పాలనుకున్నా. ఈ ఆలోచనని ముందుగా నిఖిల్‌తోనే పంచుకున్నా. బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ఈ సినిమా నిర్మించాం.

karthikeya 2 movie
దర్శకుడు చందూ మొండేటి

మరిన్ని సీక్వెల్స్..!
'కార్తికేయ', 'కార్తికేయ 2'.. ఈ రెండు సినిమాల కథలు వేరు. కానీ, హీరో పాత్ర ఒకేలా ఉంటుంది. హీరో అందులో మెడికల్‌ స్టూడెంట్‌.. ఇందులో డాక్టర్‌. 'కార్తికేయ'ను చూడని వారికీ ఈ సీక్వెల్‌ అర్థమవుతుంది. కృష్ణుడు ఉన్నాడా, లేడా? అనేది చాలామందికి ఉన్న సందేహం. దాని గురించే చెప్పే చిరు ప్రయత్నమే ఈ సినిమా. ఈ చిత్రానికి దక్కే ప్రేక్షకాదరణపై తదుపరి సీక్వెల్స్‌ ఆధారపడి ఉన్నాయి.

అందుకే అనుపమ్‌ ఖేర్‌
ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు కొన్ని.. హిమాచల్‌ ప్రదేశ్‌ నేపథ్యంలో సాగుతాయి. వాటిల్లో నటించేందుకు అనుపమ్‌ ఖేర్‌ అయితేనే బాగుంటుందనిపించింది. మరోవైపు, ఇది పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకున్న చిత్రం కాబట్టి హిందీ ప్రేక్షకులకు తెలిసిన ఓ నటుడు ఉంటే ప్లస్‌ అవుతుందనుకున్నాం. పాత్రకు తగ్గ న్యాయం చేశారాయన. అనుపమ్‌ పాత్ర నిడివి తక్కువే అయినా మంచి ప్రభావం చూపుతుంది. పార్ట్‌ 1లోని పాత్రలన్నింటినీ పార్ట్‌ 2లో చూపించాలంటే కష్టం. అందుకే 'కార్తికేయ'లో హీరోయిన్‌గా నటించిన స్వాతి పాత్ర 'కార్తికేయ 2'లో ఉండదు.

కార్తికేయ 2
కార్తికేయ 2

వారంతా చూస్తే ఆనందం..
ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడినా నేను ఒత్తిడికి గురికాలేదు. ఓ దర్శకుడిగా కొంత అనుభవం ఉంది కాబట్టి టెన్షన్‌ అనిపించలేదు. ఇప్పటి వరకూ మా సినిమా విషయంలో అంతా మంచే జరిగింది అనుకుంటున్నా. ఈ చిత్రాన్ని 15 ఏళ్లలోపు వారు ఎంత ఎక్కువ మంది చూస్తే నాకు అంత ఆనందం. పిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి.

తదుపరి ప్రాజెక్టులు..
ప్రస్తుతానికి రెండు కథల్ని సిద్ధం చేశా. వాటిల్లోని ఓ కథతో గీతా ఆర్ట్స్‌ నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేయబోతున్నా. హీరోహీరోయిన్ల వివరాలు నిర్మాణ సంస్థే ప్రకటిస్తుంది. ఫలానా నేపథ్యంలోనే సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోను. నాకు ఏ పాయింట్‌ నచ్చితే ఆ తరహాలోనే కథల్ని రాసుకుంటా. ఎప్పటికైనా పూర్తిస్థాయి కామెడీ చిత్రాన్ని తీయాలనే కోరిక ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: 'డైరెక్టర్ చెప్పినట్టే చేశా.. కానీ కాలు విరగ్గొట్టుకున్నా!'

విజయ్​ 'లైగర్'​ మేకింగ్ స్టిల్స్​.. సూపరహే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.