ETV Bharat / entertainment

సింపుల్​గా హీరోయిన్​ ఎంగేజ్​మెంట్​.. కోరుకున్నవాడితోనే.. - కన్నడ నటి హరిప్రియ సినిమాలు

కన్నడ నటుడు వశిష్ఠ, హీరోయిన్‌ హరిప్రియ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

సింపుల్​గా హీరోయిన్​ ఎంగేజ్​మెంట్
సింపుల్​గా హీరోయిన్​ ఎంగేజ్​మెంట్
author img

By

Published : Dec 3, 2022, 9:37 PM IST

కన్నడ నటుడు వశిష్ఠ, హీరోయిన్‌ హరిప్రియ డేటింగ్‌లో ఉన్నారంటూ శాండల్‌వుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ఇటీవలే వీరిద్దరూ దుబాయ్‌ నుంచి బెంగళూరుకు తిరిగివస్తూ ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కడంతో వారి ప్రేమ విషయం నిజమేనని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వశిష్ఠ, హరిప్రియల నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

సింపుల్​గా హీరోయిన్​ ఎంగేజ్​మెంట్
సింపుల్​గా హీరోయిన్​ ఎంగేజ్​మెంట్

కాగా వశిష్ట, హరిప్రియ ఓ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. తొలిచూపులోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారింది. హరిప్రియ కన్నడలో ఉగ్రమ్‌, రన్న, రికీ, నీర్‌ దోసె, భర్జరి, సంహారా, లైఫ్‌ జోతే ఓంద్‌ సెల్ఫీ, బెల్‌ బాటమ్‌ చిత్రాలతో ఫేమ్‌ సంపాదించారు. మరోవైపు సింహా ఆర్య లవ్‌ చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు వశిష్ట. రాజా హులి, రుద్ర తాండవలో విలన్‌గానూ మెప్పించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.