ETV Bharat / entertainment

బీస్ట్‌ మోడ్‌లో హీరో కల్యాణ్‌రామ్‌.. 'డెవిల్‌' కోసం ఫుల్​ వర్కౌట్స్​! - kalyanram latest neews

'బింబిసార' సినిమాతో బ్లాక్​బస్టర్​ హిట్​ అందుకున్న హీరో నందమూరి కల్యాణ్​ రామ్​ అదే జోష్​తో వరుస చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఓ సినిమా కోసం ఆయన జిమ్​లో వర్కౌట్ చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది.

Kalyan Ram Gym Pic
Kalyan Ram Gym Pic
author img

By

Published : Nov 20, 2022, 10:54 AM IST

Kalyan Ram Viral Photo: ఫలితంతో సంబంధం లేకుండా కెరీర్‌ ప్రారంభం నుంచి కథా బలమున్న సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. ఇటీవలే 'బింబిసార'తో భారీ విజయం సాధించిన కల్యాణ్​ రామ్​.. ప్రస్తుతం అదే జోష్‌తో తన తదుపరి సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో 'డెవిల్‌' ఒకటి. 'బాబు బాగా బిజీ' సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన నవీన్‌ మేడారం ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

అయితే కల్యాణ్‌రామ్‌ ఈ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టారు. తాజాగా ఆయన జిమ్‌లో వర్కౌట్​ చేస్తున్న ఓ లుక్‌ బయటకు వచ్చింది. బీస్ట్‌ మోడ్‌లో సీరియస్‌ లుక్‌తో ఉన్న కల్యాణ్​ రామ్​ ఫొటో చూసి నందమూరి అభిమానులు ఫుల్​ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ చిత్రం కూడా 'బింబిసార' తరహాలోనే బ్లాక్‌బస్టర్ హిట్టవుతుందని ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు. కల్యాణ్‌రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్‌ నటించనున్నారు.

Kalyan Ram Gym Pic
కల్యాణ్​రామ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.