ETV Bharat / entertainment

Kalki Movie Photo Leaked : 'కల్కి' టీమ్​ లీగల్ యాక్షన్​.. ఇకపై అలా చేస్తే మీ పని అయిపోయినట్టే

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 2:14 PM IST

Kalki Movie Photo Leaked : కల్కి సినిమా నుంచి రీసెంట్​గా ఫొటో లీకైన సంగతి తెలిసిందే. అయితే ఇకపై అలా జరగకుండా ఉండేందుకు మూవీటీమ్ తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.​ ఎవరైనా లీక్​ చేయడం, షేర్ చేయడం వంటివి చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెబుతూ లీగల్ కాపీరైట్ నోటీస్​ను కూడా షేర్ చేసింది.

Kalki Movie Photo Leaked : 'కల్కి' టీమ్​ లీగల్ యాక్షన్​.. వారందరికీ వార్నింగ్​

Kalki Movie Photo Leaked : ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ 'కల్కి' సినిమా నుంచి రీసెంట్​గా ఓ ఫొటో లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మూవీటీమ్​ లీగల్ యాక్షన్ తీసుకునేందుకు రెడీ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయం నిజమేనని క్లారిటీ అయింది. లీకర్స్​కు, అలాగే లీకైనా వాటిని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా షేర్ చేసే వాళ్లకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు మేకర్స్​. "కల్కి 2898 ఏడీ సినిమా, దానికి సంబంధించిన ఏ విషయమైనా కాపీరైట్స్​ పరిధిలోకి వస్తాయి. సినిమాకు సంబంధించి సీన్స్​, ఫుటేజ్​లు లేదా ఫొటోస్​ ఏదీ షేర్ చేసినా అది చట్ట విరుద్ధం. అందుకు చట్ట పరమైన శిక్ష ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ చర్యలకు పాల్పడితే తప్పకుండా సైబర్ క్రైమ్​ పోలీసుల ద్వారా మేం లీగల్ యాక్షన్​ తీసుకుంటాం" అని మూవీ ప్రొడక్షన్ హౌస్​ వార్నింగ్ ఇచ్చింది.

కాగా, ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ లీక్​ల బెడద ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద చర్చలే కొనసాగుతున్నాయి. ఇటీవలే మెగా పవర్ స్టార్​ రామ్ చరణ్​ గేమ్​ ఛేంజర్​, సూపర్ స్టార్​ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి కూడా ఓ సాంగ్​, పిక్స్ వంటి​ లీక్ అయ్యాయి. సోషల్​ మీడియాలో లీకైన క్షణాల్లోనే విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ఈ విషషంపై ప్రముఖ నిర్మాత దిల్​ రాజు గట్టి చర్యలు కూడా తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేశారు.

ఇకపోతే కల్కి.. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ డైరెక్ట్ చేస్తున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. యూనివర్సల్ స్టార్​ కమల్‌ హాసన్‌ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ బ్యానర్‌పై అశ్వినీదత్‌ అత్యంత భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Game Changer Leaked Song : 'గేమ్ ఛేంజర్' సాంగ్ లీక్​పై దిల్​రాజు లీగల్ యాక్షన్.. సైబర్ క్రైమ్​లో కంప్లైంట్

ప్రాజెక్ట్​-కె మూవీ మేకర్స్ షాకింగ్ న్యూస్.. ఫ్యాన్స్​కు ఎదురుచూపులు తప్పవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.