ETV Bharat / entertainment

జూనియర్ ఎన్టీఆర్​తో నటించడం నా డ్రీమ్​: జాన్వీ కపూర్ - మిస్టర్‌ అండ్ మిస్ట్రెస్‌ మహి

JANVI KAPOOR JR NTR: అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైంది అందాల తార జాన్వీ కపూర్‌. తన మొదటి చిత్రం 'ధడక్‌'తోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉన్నది ఉన్నట్లు, సూటిగా మాట్లాడడం జాన్వీ నైజం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన డ్రీమ్​ హీరో ఎవరో చెప్పింది. జూనియర్ ఎన్టీఆర్​తో నటించడం తన డ్రీమ్​ అని తెలిపింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 5, 2022, 8:35 AM IST

JANVI KAPOOR JR NTR: అనతి కాలంలోనే ప్రత్యేకమైన ఫేమ్‌ను సంపాదించుకున్న యువనటి జాన్వీ కపూర్. ఉన్నది ఉన్నట్లు, సూటిగా మాట్లాడటం ఈ ముద్దుగుమ్మ నైజం. ఆ తరహాలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఇష్టాయిష్టాలను, భవిష్యత్‌ కోరికలను నిర్మొహమాటంగా ప్రేక్షకులతో పంచుకుంది.

'షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌ వీరిలో ఎవరితో నటించడానికి మీరు ఇష్టపడతారు?' అని అడిగిన ప్రశ్నకు.. జాన్వీ 'వాళ్లంతా సీనియర్‌ నటులు. వారికి, నాకు వయస్సులో చాలా తేడా ఉంది. అలాంటి జంటలను తెరపై చూడటానికి ప్రేక్షకులు ఒప్పుకోరు. కెమిస్ట్రీ కూడా కుదరదు. వయోభేదం ఎక్కువ ఉండటం వల్ల వారితో నటించడం నాకు ఇష్టం లేదు' అని సమాధానమిచ్చింది. ఇక 'మీ డ్రీమ్‌ హీరో ఎవరు?' అని అడిగిన ప్రశ్నకు 'తెలుగు హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో నటించడం నా డ్రీమ్‌' అని బదులిచ్చింది. ఇంకా బాలీవుడ్‌లో రణ్‌బీర్‌కపూర్, వరుణ్‌దావన్‌లతో నటించాలనే కోరిక ఉందంటూ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్‌ తాజా సినిమా 'గుడ్‌లక్‌ జెర్రీ' ప్రస్తుతం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారమవుతోంది. ఈమె ప్రధాన పాత్రల్లో నటించిన 'మిలి', 'మిస్టర్‌ అండ్ మిస్ట్రెస్‌ మహి' , 'బవాల్'చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: కమల్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. మళ్లీ సెట్స్​పైకి భారతీయుడు-2.. RC15 షూట్​కు బ్రేక్!

టాలీవుడ్ ఆశలన్నీ ఆగస్ట్​పైనే! పరాజయాలకు ఫుల్​స్టాప్​ పడేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.