ETV Bharat / entertainment

Jawan Pre Release Event : చెన్నైలో గ్రాండ్​గా 'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. బాద్​షా ఎంట్రీ అదుర్స్​ - జవాన్ ఆడియో లాంఛ్

Jawan Pre Release Event : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​, లేడీ సూపర్ స్టార్​ నయనతార లీడ్​​ రోల్​లో నటించిన లేటెస్ట్ మూవీ జవాన్​. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు చెన్నై వేదికైంది. ఇప్పటికే హిందీ ప్రివ్యూ, సాంగ్స్​తో హైప్ పెంచిన 'జవాన్​' సినిమా సెప్టెంబర్​ 7న థియేటర్లలో గ్రాండ్​గా విడుదల కానుంది.

Jawan Pre Release Event
Jawan Pre Release Event
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2023, 6:17 PM IST

Updated : Aug 30, 2023, 7:49 PM IST

Jawan Pre Release Event : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​, కోలీవుడ్​ లేడీ సూపర్ స్టార్​ నయనతార లీడ్​ రోల్​లో నటించిన లేటెస్ట్ మూవీ 'జవాన్'​. బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు చెన్నై వేదికైంది. ఈ వేడుకకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఈవెంట్​ హాల్​ ఫ్యాన్స్​ కోలాహలంతో సందడిగా మారింది.

ఇక ఈ వేడుకకు హాజరైన హీరో షారుక్ ఖాన్​కు.. తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి హగ్​ ఇచ్చి వెల్​కమ్ చెప్పారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్​ (Anirudh Ravichander)ను షారుక్​ ప్రేమగా హత్తుకున్నారు. సినిమా డైరెక్టర్ అట్లీ.. ఆయన భార్య ప్రియతో కలిసి ఈవెంట్​కు వచ్చారు. సీనియర్ నటి ప్రియమణి ఇతర నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు.

వేదికపై అనిరుధ్-షారుక్ డ్యాన్స్.. మ్యూజిక్ సంచలనం అనిరుధ్.. ఈ సినిమాకు సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఏ ఆడియో ఫంక్షన్​ అయినా.. అనిరుధ్ ఈవెంట్​కు వచ్చారంటే వేదికపై సందడి చేస్తారు. తన లైవ్ పెర్ఫార్మెన్స్​తో​ ఫ్యాన్స్​లో జోష్ నింపి..​ పూనకాలు తెప్పిస్తారు. అలాగే ఈ ఈవెంట్​లో అనిరుధ్.. ఏకంగా హీరో షారుక్​ను తనతో పాటు స్టేజ్​పైకి తీసుకెళ్లారు. వీరిద్దరూ స్టేజ్​పై కొద్దిసేపు డ్యాన్స్​ చేశారు. అనిరుధ్, షారుక్​కు స్టెప్పులు నేర్పించిన తీరు షో లో ఫ్యాన్స్​కు ఫుల్​ కిక్​ ఇచ్చింది. వీరి డ్యాన్స్​ ఈ వేడుకకు హైలైట్​గా నిలిచింది.

Jawan Trailer Announcement : ఈ సినిమా ట్రైలర్​ను​ గురువారం దుబాయ్ బుర్జ్ ఖలీఫా బిల్డింగ్​పై రాత్రి 9 గంటలకు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్​ వీడియోలు, సాంగ్స్​ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. మరోవైపు యూఎస్​ఏలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్​ ఓ రేంజ్​లో సాగుతున్నాయని పలు కథనాలు వెలువడ్డాయి. ఇక రిలీజ్​ డేట్ దగ్గరపడుతుండడం వల్ల.. ఫ్యాన్స్​లో ఉత్కంఠ పెరుగుతోంది.

Jawan Cast : ఇక జవాన్ విషయానికొస్తే.. ఈ సినిమాలో కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్​గా నటిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్​గా కనిపించనున్నారు. ఈ మూవీలో షారుక్ ​మునుపెన్నడూ లేని లుక్​లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై గౌరీ ఖాన్.. జవాన్​ను భారీ బడ్జెట్​తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న పాన్ ఇండియా లెవెల్​లో రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jawan VS Salaar : అడ్వాన్స్​ బుకింగ్స్​​.. జవాన్​-సలార్​ సరికొత్త రికార్డ్స్​!

''జవాన్​'లో షారుక్ లుక్​ కాపీనే.. సీన్స్​ కూడా ఆ సినిమాలోవే!'.. లైక్స్​లో 'సలార్'​దే పైచేయి..

Last Updated : Aug 30, 2023, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.