Alluarjun Hollywood offer 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీతో అంతర్జాతీయ స్థాయిలో బన్నీ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం వరుస యాడ్స్ షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే 'పుష్ప 2' షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు.
అయితే ఈ మధ్య భార్య స్నేహారెడ్డితో కలిసి న్యూయార్క్ టూర్‌కు వెళ్లారు. అక్కడ బన్నీకి అరుదైన గౌరవం కూడా దక్కింది. అక్కడ నిర్వహించిన 'ఇండియా డే పరేడ్ న్యూయార్క్ - 2022' కార్యక్రమానికి ఈ యేడాది గ్రాండ్ మార్షల్ హోదాలో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్‌కు తాజాగా ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది.
'పుష్ప'లో బన్నీ నటనకు మనసు పారేసుకున్న ఓ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు.. ఐకాన్‌స్టార్‌తో ఎలాగైనా సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు ఆయన కోసం తన కథలో ఓ పవర్‌ఫుల్ రోల్‌ను క్రియేట్ చేశారట. ఈ క్రమంలోనే బన్నీ న్యూయార్క్ పర్యటనకు వచ్చారని తెలుసుకుని మరీ.. ఆయన్ని ప్రత్యేకంగా కలిసి.. తన సినిమా గురించి చర్చించారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి దీనికి బన్నీ ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చారు, అసలు ఆ దర్శకుడు ఎవరు? వంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక పుష్ప సీక్వెల్ విషయానికొస్తే.. ఇటీవలే షూటింగ్ పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. తొలి భాగంలో నటించిన రష్మిక, అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ 'పుష్ప ది రూల్'లోనూ కొనసాగనున్నారు. అయితే రెండో భాగంలో విజయ్‌సేతుపతి నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. రూ.350 కోట్లతో దీన్ని రూపొందించనున్నారట. కాగా, ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి: కిరాక్ అందాలతో కిక్కెక్కిస్తున్న కేతిక శర్మ, కృతిశెట్టి