ETV Bharat / entertainment

మరోసారి అల్లు అర్జున్​ దాతృత్వం.. ఈ సారి తన డ్రైవర్​ కోసం ఏకంగా..

ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​కు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. ఇటీవలే కేరళకు చెందిన ఓ నర్సు విద్యార్థిని చదివించేందుకు ముందుకొచ్చిన ఆయన.. ఇప్పుడు తన డ్రైవర్​కు అండగా నిలిచి ఆర్థిక సాయం చేశారు.

Icon star Alluarjun financial helps to his driver
మరోసారి అల్లుఅర్జున్​ దాతృత్వం.. ఈ సారి తన డ్రైవర్​ కోసం ఏకంగా..
author img

By

Published : Nov 12, 2022, 11:11 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్ప మనసు చాటుకుటున్నారు. పుష్ప సినిమాతో ఇప్పటివరకు వరుసగా అవార్డులు సొంతం చేసుకున్న బన్నీ.. ఇప్పుడు సేవా కార్యక్రమాలతో ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటున్నారు. ఇటీవలే కేరళకు చెందిన ఓ నర్సు విద్యార్థిని చదివించేందుకు ముందుకొచ్చిన ఆయన.. ఇప్పుడు తన డ్రైవర్​కు అండగా నిలిచారు.

వరంగల్​కు చెందిన మహిపాల్ అనే వ్యక్తి.. బన్నీ దగ్గర పదేళ్ల నుంచి డ్రైవర్​గా పనిచేస్తున్నారు. ఆయన బోరబండలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి నిర్మాణానికి తన వంతు సాయంగా అల్లు అర్జున్ రూ.15 లక్షలు అందజేశారు. ఈ విషయాన్ని చెబుతూ డ్రైవర్ ఫ్యామిలీతో బన్నీ తీసుకున్న ఫొటో ఒకటి వైరల్​గా మారింది. ఇక బన్నీకి తన డ్రైవర్ పట్ల ఉన్న అభిమానం, బాధ్యతను చూసిన అతడి ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు.

  • శభాష్‌ అర్జున్‌..టాలీవుడ్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన దగ్గర 10ఏళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్‌ ఓ మహిపాల్‌ బోరబండలో ఇల్లు నిర్మించుకోవడానికి 15లక్షలు రూపాయలు బహమతిగా ఇచ్చాడు. వరంగల్‌కు చెందిన మహిపాల్‌ 10ఏళ్లుగా అర్జున్‌ వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. @alluarjun #AlluArjun pic.twitter.com/rVgiuH9fA3

    — DONTHU RAMESH (@DonthuRamesh) November 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కాగా, అల్లు అర్జున్ చేసిన మరో మంచిపని కూడా తాజాగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేరళకు చెందిన ఓ ముస్లిం నర్సింగ్​ విద్యార్థికి బన్నీ అర్థిక సాయం అందజేస్తున్నట్లు అలెప్పీ జిల్లా కలెక్టర్ వీఆర్ కృష్ణతేజ సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారు. అలెప్పీకి చెందిన ఆ విద్యార్థిని బీఎస్సీ నర్సింగ్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంక్ తెచ్చుకుంది. కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అల్లు అర్జున్​కు తెలియజేశారు. దీంతో బన్నీ.. ఆమెకు మూడేళ్ల పాటు కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఇలా రోజుల వ్యవధిలో అల్లు అర్జున్ చేసిన మంచి పనులు చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఇదీ చూడండి: వర్షతో సుధీర్ రొమాన్స్​.. చిర్రెత్తిపోయిన ఇమ్మూ.. రష్మి ఏం చేస్తుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.