టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో కాస్త జోరు తగ్గించి బాలీవుడ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అక్కడ స్టార్ హీరోల సరసన వరసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అలా ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. మరిన్ని చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్‌లో ఉంది. అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను వర్క్ ఆల్కాహాలిక్ అని చెప్పింది. తానెప్పుడు తర్వాత ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తూ ఉంటానని పేర్కొంది.
"మనం పోషించడానికి ఇక్కడ ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఈ వృత్తిలో ఒక బెంచ్‌మార్క్‌ను నిర్దేశించలేం. ఇక్కడ హద్దులు లేవు. నేను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటున్నాను. నేను పని పట్ల ఎంతో ఆకలితో ఉన్నాను. నేను వర్క్ ఆల్కాహాలిక్. నావి ఈ ఏడాది ఇప్పటికే ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ నేను తర్వాత ఏం చేయాలి అనే విషయం గురించే ఆలోచిస్తున్నాను. నేనెప్పుడు 'తర్వాత ఏంటి' అనే ఆలోచనలోనే ఉంటాను. రన్‌వే 34, ఛత్రివాలి, థ్యాంక్ గాడ్ లాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ వృత్తి ఎంతో అందమైనది. రకరకాల సినిమాలు చేయొచ్చు. నేను విలక్షణమైన నటిని. అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. నేను రివ్యూలు చదువుతుంటాను. ఒకవేళ అది మంచి ఫీడ్‌బ్యాక్ గొప్పగా అనిపిస్తుంది. క్రిటికల్‌గా ఉంటే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోవాడనికి ఉపయోగపడుతుంది." అని చెప్పింది.
ఇక తాజాగా విడుదలైన థ్యాంక్ గాడ్ సినిమా గురించి మాట్లాడుతూ.. "నేను ఆధ్యాత్మిక వ్యక్తిని. కర్మను ఎక్కువగా నమ్ముతాను. ఓ మంచి వ్యక్తిలా ఉండాలనుకుంటున్నాను. దర్శకుడు ఇంద్రకుమార్‌తో పనిచేసిన తర్వాత నాలో అధ్యాత్మికత మరింత పెరిగింది. మేము దేశంలో ఉన్న దేవుడు, మతం, ఆచారాలు వంటి అంశాలపై మాట్లాడుకున్నాము. దేవుడికి మానవత్వం కావాలి. అది మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సరిగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. థ్యాంక్ గాడ్ సినిమా ఈ విషయాన్నే తెలియజేస్తుంది" అని పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది రకుల్.. అటాక్, రన్‌వే 34, కట్పుత్లీ, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఛత్రివాలీ, మేరీ పత్నీ కా రీమేక్, ఇండియన్ 2, అయాలాన్, 31 అక్టోబర్ లేడీస్ నైట్ చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: ఆ సినిమాలో పాటగా బాలయ్య కవిత.. టైటిల్‌గా చిరు డైలాగ్